‘ఉప్పెన’ సినిమా ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు. కరోనా కారణంగా తొలి సినిమా ఇంకా విడుద కాకముందే ఆయనకు అవకాశాలు తలుపు తడుతున్నాయట. కాని ఇప్పటికే విడుదలైన పాటలకు మాత్రం మంచి రెస్పాన్స్ వస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాతో మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి జంటగా నటించారు. ఇప్పటికే కృతి శెట్టి నాని సినిమాలో ఛాన్స్ కొట్టేయగా.. మరికొంతమంది డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారట.
అసలు విషయానికొస్తే.. తమ బ్యానర్లో సినిమా చేసేందుకు సితార ఎంటర్‌టైన్స్‌మెంట్ బుచ్చిబాబు సానాతో ఒప్పందం చేసుకుని రూ.50లక్షల అడ్వాన్స్ ఇచ్చింది. అయితే అగ్రిమెంట్ ప్రకారం బుచ్చిబాబు రెండో సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ సంస్థలోనే చేయాలి. మూడో సినిమాగా సితార ఎంటర్‌టైన్స్‌మెంట్స్ బ్యానర్లో చేస్తానని బుచ్చిబాబు చెప్పారట. దీనికి వారు ఒప్పుకోకపోవడంతో వెంటనే బుచ్చిబాబు తీసుకున్న అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేశాడని టాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ.. సోషల్‌మీడియా అయితే ఓ రేంజ్లో ప్రచారం జరుగుతోంది. కాగా బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ‘ఉప్పెన’ సినిమాకు వివిధ ఓటీటీ సంస్థల నుండి భారీ ఆఫర్స్ వస్తున్నాయని, కాని ఈ సినిమాను ఎట్టి పరిస్థితిల్లో సినిమా థియాటర్స్ లోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే నిర్మాతలు తెలియజేశారు. విజయ్ సేతుపతి ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.