Uppena Heroine Krithi Shetty Will Acts With Natural Star Nani Film Shyam Singha Roy

Krithi Shetty:  తెలుగులో తొలి సినిమా విడుదల కాకముందే భారీ క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ కీర్తి శెట్టి. కొంత మంది హీరోయిన్స్ కు సక్సెస్ లు దక్కినా కూడా తదుపరి సినిమాల ఆఫర్లు రావడానికి చాలా సమయం పడుతుంది. కాని కొందరు ముద్దుగుమ్మలు మాత్రం మొదటి సినిమా కూడా విడుదల అవ్వకుండా వరుసగా ఆఫర్లు దక్కించుకుంటారు. ఈ అమ్మాయి స్క్రీన్ పేరు అద్వైత. అదే పేరుతో కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. తెలుగులో మాత్రం కీర్తి శెట్టి పేరుతోనే పరిచయం అవుతోంది.

లాక్‌డౌన్ కారణంతో ‘ఉప్పెన’ సినిమా విడుదల ఆగిపోయినప్పటికీ కీర్తి శెట్టికి మాత్రం అవకాశాలు తలుపు తడుతున్నాయి. తమ సినిమాల్లో నటించాలంటూ దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నాని నటిస్తున్న ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమాలో కూడా ఈమెను హీరోయిన్ గా ఎంపిక చేశారు అంటూ సమాచారం అందుతోంది. నానికి జోడీగా నటించే అవకాశం రావడంతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా దక్కించుకుంది.

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. ఫస్ట్ పార్ట్‌లో ఒకరు, సెకండ్ పార్ట్‌లో ఒకరు, క్లైమక్స్‌లో మరో హీరోయిన్ కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో సాయిపల్లవిని ఓకే చేయగా.. ఇప్పుడు కీర్తి శెట్టి చేరింది. ఈ సినిమా నిర్మిస్తున్న సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ తాము తీయబోయే మరో సినిమాకు కూడా కీర్తి శెట్టిని బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఉప్పెన అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ లోపే ఈమెకు ఏకంగా మూడు నాలుగు ఆఫర్లు రావడం అంటే మామూలు విషయం కాదు.