ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో ‘ఉప్పెన

287
uppena-movie-to-stream-on-netflix-from-11th-april
uppena-movie-to-stream-on-netflix-from-11th-april

‘ఉప్పెన’ భారీ కలెక్షన్లతో పాటుగా ప్రముఖుల ప్రశంసలు అందుకుంటూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ సక్సెస్ ను తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ థియేటర్లలో సందడి చేస్తుంది చిత్రబృందం. ఈ సినిమాలో వైష్ణవ్‌కు జోడీగా కృతి శెట్టి నటించగా.. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌ పాత్రలో నటించాడు.

 

 

మైత్రీ మూవీ మేకర్స్‌ తో కలిసి సుకుమార్‌ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా కోలీవుడ్ ​, బాలీవుడ్‌లోకి కూడా రీమేక్‌ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. ఇదిలా ఉంటే ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ రూ.7 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.