మార్చి 18న ‘ఉప్పెన’ స‌క్సెస్ ఈవెంట్‌

356
Uppena Success Event on March 18th
Uppena Success Event on March 18th

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కృతి శెట్టి నటించగా, విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మించాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌ను అందుకుంది.

 

వంద కోట్ల గ్రాస్‌ను ఈ చిత్రం సాధించిందని చిత్ర నిర్మాతలు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఉప్పెనంత విజ‌యాన్ని అందుకున్న ఈ సినిమా సెలెబ్రేషన్స్ కు సిద్దమవుతుంది. ఉప్పెన సక్సెస్ ను అంద‌రితో పంచుకునేందుకు మార్చి 18న హైద‌రాబాద్‌లో సెల‌బ్రేష‌న్ ఈవెంట్ నిర్వ‌హించేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది. టీం స‌భ్యులంద‌రితోపాటు ప్రత్యేక అతిథిలు కూడా ఈ సెల‌బ్రేష‌న్స్ లో భాగం కాబోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది.