సాధారణంగానే టాలీవుడ్ లో సంక్రాంతి (Sankranti 2024) పండుగకు తీవ్ర స్థాయిలో పోటీ ఉంటుంది. ప్రతీ అగ్ర హీరో కూడా తన సినిమాని అదే సీజన్ లో రిలీజ్ చేయాలని భావిస్తుంటారు. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు పోటీ పడ్డారు. అయితే వచ్చే పండుగ కోసం మన హీరోలంతా ఇప్పటి నుంచే కర్చీఫ్ లు వేయడం మొదలుపెట్టారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ప్రాజెక్ట్ K’ (Project K) చిత్రాన్ని 2024 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలానే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) – షోమ్యాన్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న RC15 మూవీని కూడా వచ్చే పొంగల్ లక్ష్యంగా పూర్తి చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు తెలిపారు. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం సంక్రాంతి పండుగనే టార్గెట్ గా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) అనే సినిమా రానున్న సంగతి తెలిసిందే. ఇది తమిళ్ లో హిట్టయిన ‘తేరి’ చిత్రానికి అధికారిక రీమేక్. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ మొదటి వారం నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుందని వార్తలు వస్తున్నాయి. పర్ఫెక్ట్ ప్లాన్ తో సెట్స్ మీదకు తీసుకెళ్ళి .. సంక్రాంతికి రిలీజ్ చేసేలా పని చేయనున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
ఇప్పటికైతే ‘ప్రాజెక్ట్ కె’ మరియు RC15 సినిమాలు 2024 సంక్రాంతిని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే షూటింగ్ లో ఆలస్యం జరిగితే, మరేవైనా ఇతర అంతరాయాలు ఏర్పడితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రాకపోవచ్చు. కాబట్టి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సంక్రాంతి స్పెషల్ గా విడుదల కావడం దాదాపు ఖాయమని అంటున్నారు.
ఒకవేళ RC15 సినిమా అనుకున్న సమయానికి రెడీ అయినా.. పవన్ కళ్యాణ్ కచ్ఛితంగా ఫెస్టివల్ సీజన్ లో రావాలని ఫిక్స్ అయితే మాత్రం రామ్ చరణ్ వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. కాకపోతే ఈసారి బాబాయ్ అబ్బాయ్ లలో ఎవరో ఒకరు రావడం పక్కా అని అర్థమవుతోంది. ఇద్దరిలో ఎవరు వచ్చినా ప్రభాస్ తి పోటీ పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Ustaad Bhagat Singh and RC15 coming to Sankranti 2024, Pawan Kalyan Ustaad Bhagat Singh Release date, Ram Charan RC15 Release Date, Sankranti 2024 movies list and release dates, Pawan Kalyan vs Ram Charan