Ustaad Bhagat Singh Glimpse Review: స్టార్టింగ్ లో భగవద్గీత నుంచి ఏ కాలమున ధర్మముకు హాని కలుగునో… అధర్మం వృద్ధి చెందునో…ఆయా సమయంలో నందు ప్రతి యుగమున అవతారము దల్తును…అన్న శ్లోకం వచ్చి వెంటనే పవన్ బేస్ వాయిస్ లో భాగ అనేది చూసే వాళ్లకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంది. మహంకాళి పోలీస్ స్టేషన్…. పత్తర్ గంజ్ ..పాత సిటీ మాస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ లో పవన్ ఎంట్రీ ఎక్స్ట్రార్డినరీగా ఉంది.
Ustaad Bhagat Singh Glimpse Review: ఈ వీడియో చూసిన ఎవరికైనా గబ్బర్ సింగ్ నుంచి పవన్ (Pawan Kalyan) ఈ మూవీ ఉంటుంది అని కన్ఫామ్ గా అర్థమవుతుంది. దానికి తోడు వీడియోలో ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలై పోతుంది అని మాస్ డైలాగ్ పవన్ చెబుతూ ఉంటే ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఖుష్ అవుతున్నారు. ఒక్క చిన్న వీడియో తోటే మూవీ పై అంచనాలను ఓ రేంజ్ లో పెంచాడు డైరెక్టర్. మొత్తానికి ఈ మూవీలో పాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జలక్ చూసే భాగ్యం అందరికీ కలుగుతుంది అని అభిమానులు ఆశిస్తున్నారు.
హీరోలు టాలీవుడ్ లో ఎందరో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అంటే ప్రజలకు ప్రత్యేకమైన అభిమానం అతని కేవలం ఓ నటుడిగా కాకుండా ఇంటి సభ్యుడుగా భావించే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఓ పక్క రాజకీయాల్లో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఎంతో ఇష్టమైన సినీ కెరీర్ ని వదలకుండా ఎప్పటికప్పుడు వినూత్నంగా చిత్రాలు తీస్తూ ప్రజల ఆదరణ పొందుతూనే ఉన్నాడు పవన్. ఈరోజు విడుదల చేసిన ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) మూవీకి గ్లింప్స్ (Glimpse) వీడియో నిజంగా అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పవచ్చు.
పవన్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. క్రిష్ డైరెక్షన్లో హరిహర వీరమల్లు, సుజిత్ కాంబినేషన్లో ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ మరియు వినోదయ సీతం అనే రీమేక్ మూవీలో పవన్ ప్రస్తుతం నటిస్తున్నారు. హరీష్ శంకర్ డైరెక్షన్లో పవన్ చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో మంచి మాస్ యాంగిల్ లో పవన్ తన ప్రేక్షకులను మరోసారి ఆనందింప చేయనున్నారు. గతంలో వరస ఫ్లోప్ లతో బాధపడ్డారు.. పవన్ కళ్యాణ్ 11 సంవత్సరాల క్రితం విడుదలైన గబ్బర్ సింగ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ ఆయనకు సక్సెస్ నే కాదు మంచి స్టార్ డం ని కూడా తెచ్చింది అని చెప్పవచ్చు.
మళ్లీ తిరిగి ఇప్పుడు గబ్బర్ సింగ్ కంటే మాస్ మూవీ తో పవన్ ఉన్న పోస్టర్స్ ప్రజలను ఆకట్టుకుంటున్నారు. సుమారు 42 సెకండ్ల నిడివి తో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ వీడియో గ్లింప్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు. లుంగీ కట్టుకొని వెనక సైడు కనిపెట్టుకొని పవన్ కళ్యాణ్ మాస్ లుక్ మరియు మ్యానరిజం చూస్తే మూవీ మాత్రం అభిమానులకు ఫుల్ ట్రీట్ అని చెప్పవచ్చు. ఒక్క చిన్న వీడియో చూసే పవన్ పర్ఫామెన్స్ కి విజిల్స్ కొట్టాలి అనిపిస్తూ ఉంటే మరి బిగ్ స్క్రీన్ పైన చూస్తే అభిమానుల పరిస్థితి ఏమిటో…. ఇది తెలియాలంటే విడుదల వరకు ఆగాల్సిందే.
Web title: Pawan Kalyan latest movie video, Pawan Kalyan and Harish Shankar movie video, Ustaad Bhagat Singh Glimpse Public talk, Sreeleela Ustaad Bhagat Singh Glimpse review, Ustaad Bhagat Singh shooting update