Homeసినిమా వార్తలుసలార్ నైజాం రైట్స్ కోసం ప్రభాస్ స్నేహితుల పోటీ.?

సలార్ నైజాం రైట్స్ కోసం ప్రభాస్ స్నేహితుల పోటీ.?

Salaar Nizam rights, Prabhas Salaar Business record details, UV Creations and Mythri Movie Makers fight for Salaar Nizam rights, Salaar Trailer Release Date, Salaar Pre Release Businesss.

Salaar Nizam rights, Prabhas Salaar Business record details, UV Creations and Mythri Movie Makers fight for Salaar Nizam rights, Salaar Trailer Release Date, Salaar Pre Release Businesss.

అన్ని అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ సమయానికి ప్రభాస్ సలార్ (Salaar) మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ వస్తున్నాయని లెక్కలు వేసుకుంటా ఉండేవారు అందరూ.. కానీ అనుకోని కారణాలవల్ల సలార్ మూవీ పోస్ట్ పోన్ అవుతూ చివరికి డిసెంబర్ 23న క్రిస్టమస్ సందర్భంగా విడుదలకు సిద్ధం చేశారు.. దానితోపాటు మేకర్స్ కూడా బాగానే ప్లాన్ చేశారు క్రిస్టమస్ కి లాంగ్ వీకెండు దానితోపాటు న్యూ ఇయర్ రావడంతో బాక్సాఫీస్ వద్ద సలార్ మూవీ అంచనా దానికన్నా ఎక్కువే కలెక్షన్స్ వస్తాయని ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

ఇక మరోపక్క సలార్ మూవీకి సంబంధించిన బిజినెస్ (Business) కూడా అన్ని ఏరియాల్లో ఇప్పటికే దాదాపు క్లోజ్ చేసినట్టు చెబుతున్నారు.. కానీ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అన్ని ఏరియాల్లో క్లోజ్ చేయగా నైజాం (Nizam Rights) సంబంధించి పోటీ బాగానే కనబడుతుంది.. ఇక వివరాల్లోకి వెళ్తే సలార్( Salaar) మూవీ కి సంబంధించిన నైజాం రైట్స్ కోసం ప్రభాస్ స్నేహితులైన.. యువి క్రియేషన్స్ అలాగే మరోపక్క మైత్రి మూవీ మేకర్స్ వారు బాగానే పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది..

అయితే దిల్ రాజు వీళ్ళ ఇద్దరి మధ్య ఎందుకు ఎంటర్ అవటం అని పక్కకు తప్పుకున్నట్టు తెలుస్తుంది.. దిల్ రాజు ఇప్పటికే సంక్రాంతి మూవీస్ కి పెట్టుబడి పెట్టడం అలాగే దానికి తోడు సినిమాపై రిజల్ట్ ఎలా ఉంటుందో అని అనుమానాలు కూడా చాలానే వస్తున్నాయి. UV క్రియేషన్స్ చాలా గట్టిగా ఈ రైట్స్ కోసం నిలబడేటప్పటికీ పోటీ అవసరం లేదు అనుకుంటూ డ్రాప్ అయ్యారంట.

ఇక UV క్రియేషన్స్ ప్రభాస్ బ్యానర్ అయినప్పటికీ ప్రభాస్ తో సంబంధం లేకుండా తన సొంతగా ఈ సినిమా హక్కుల గురించి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తుంది.. ఈ విషయంలో ప్రభాస్ ఐతే ఏ విధంగాను కలుగజేసుకోవడం లేదు. హోంబల్ ఫిలిమ్స్ వారే సినిమా బిజినెస్ కొనసాగిస్తున్నారు. కానీ మైత్రి మూవీ Salaar Nizam rights కోసం బాగానే కోట్ చేసినట్టు సమాచారము.. మరి చివరికి UV క్రియేషన్స్ లేదంటే మైత్రి మూవీ మేకర్స్ సలార్ మూవీ రైట్స్ ని ఎవరు తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.. మరో రెండు మూడు రోజుల్లో దీనిపై క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది.

ఇక ప్రభాస్ (Prabhas) సలార్ మూవీ విషయానికి వచ్చేటప్పటికి ప్రస్తుతం కొన్ని సన్నివేశాలను ప్రస్తుతం రీ షూట్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ట్రైలర్ ని విడుదల చేసి స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారంట. మరి సలార్ మూవీతో షారుక్ ఖాన్ మూవీ డంకి కూడా పోటీలో ఉంది. బాలీవుడ్ వార్తా కథనాల ప్రకారం షారుక్ ఖాన్ డాంకీ మూవీ పోస్ట్ పోన్ అయ్యా అవకాశాలు ఉన్నట్టు చెబుతున్నారు.. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఎలాంటి మార్పులు ఉంటాయో చూడాలి.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY