భారీ ధరకు అమ్ముడుపోయిన ‘వి’ హిందీ డబ్బింగ్ రైట్స్!

V movie Hindi dubbing rights sold for a Big amount
V movie Hindi dubbing rights sold for a Big amount

Nani-Sudheer Babu v movie hindi dubbing rights: నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీస్టారర్ ‘V’. వి సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయాయి. దీని కోసం 8.4కోట్లతో ఓ హిందీ నిర్మాణ సంస్థ హక్కులు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

నేచురల్ స్టార్ నాని, సుధీర్‌బాబు, నివేదా థామస్, అదితిరావ్ హైదరీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వి’ సినిమా ఇటీవలే ఓటీటీ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన కెరీర్లో 25వ చిత్రమైన ‘వి’పై నాని ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది.

దీంతో ఓటీటీలో రిలీజ్ చేసేందుకు డిజిటల్ సంస్థలు పోటీపడినా దిల్‌రాజు మొదట ఒప్పుకోలేదు. చివరికి అమెజాన్ ప్రైమ్ రూ.33కోట్లకు ఈ సినిమాను కొనుగోలు చేసి సెప్టెంబర్ 5న స్ట్రీమింగ్ ఇచ్చింది. అయితే తొలిరోజే నెగిటివ్ టాక్ రావడంతో యూనిట్ నిరాశ చెందింది. అయినప్పటికీ ప్రైమ్‌లో చాలామంది చూస్తూనే ఉన్నారు.ఈ సినిమాకి దాదాపు 25 కోట్ల వరకూ ఖర్చు అయిందని.. అయితే అమెజాన్ 33 కోట్ల వరకు ఆఫర్ చేసిందట. ఇక డిజిటల్‌లో విడుదలైన వి పరవాలేదనిపించింది. టాక్ నెగటివ్ గా ఉన్నా చాలా మంది చూస్తుండటం విశేషం అనే చెప్పాలి.

ఇక ఈ సినిమాకు సంబందించి మరో డీల్ జరిగింది. రీసెంట్ గా వి సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. దాదాపు ఈ సినిమా 8 కోట్ల రేటు దక్కించుకుందని టాక్. దీనికి తోడు ఇప్పుడు హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్మడుపోయాయట. ఈ సినిమా కి హిందీ డబ్బింగ్ రైట్స్ కింద ఎకంగా 8.4 కోట్ల డీల్ జరిగిందని ట్రేడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.