క్రిష్‌, వైష్ణవ్‌ చిత్రం విడుదల తేదీ ఖరారు..!

0
78
Vaishnav tej and krish movie release date locked

Vaishnav Tej Krish: ‘ఉప్పెన’ చిత్రంతో తొలి ప్రయత్నంలోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్‌ తేజ్‌. అలా రెండో సినిమాతోనే ప్రముఖ దర్శకుడు క్రిష్‌తో పనిచేసే అవకాశం అందుకున్నాడు. అడవి నేపథ్యంలో సాగే విభిన్న కథ ఇది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకు చేరుకున్నాయి. సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ కు ముహూర్తం కుదిరింది. అక్టోబర్ 8న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.

త్వరలోనే ప్రచారాన్ని మొదలుపెట్టనుంది చిత్ర బృందం. టైటిల్‌ని ఇంకా ప్రకటించలేదు. అయితే ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరుని ఖరారు చేసే అవకాశాలున్నాయని చిత్ర వర్గాల్లో ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్‌.

Previous articleNidhhi Agerwal First Look Poster from Hari Hara Veera Mallu
Next articlePooja Hegde Stunning Photos