Homeసినిమా వార్తలుఅన్నప్రాసన రోజు ఆవకాయ అన్నట్లు అప్పుడే మాస్ చిత్రాలు అవసరమా…!!

అన్నప్రాసన రోజు ఆవకాయ అన్నట్లు అప్పుడే మాస్ చిత్రాలు అవసరమా…!!

Aadikeshava, Sreeleela, Aadikeshava First Glimpse, Panja Vaishnav Tej, Panja Vaishnav Tej new movie title, Panja Vaishnav Tej upcoming movies, Aadikeshava Glimpse, Aadikeshava cast crew details

Vaishnav Teja Next movie titled Aadikeshava: ఒకప్పుడు సినిమా స్టోరీ ఏదైనా అభిమాన హీరో ఉంటే చాలు జనం సినిమాని నిలబెట్టే ఆడించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి.. ప్రేక్షకులు మూవీ ని చూసే దృష్టి కంప్లీట్ గా మారింది అని చెప్పవచ్చు. హీరో చిన్నా ..పెద్ద సంబంధం లేదు.. కంటెంట్ బాగుంటే చాలు ఏ భాష చిత్రాన్నైనా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ఇందుకు నిదర్శనమే భారీ హిట్లు సాధించిన కాంతారా లాంటి చిన్న చిత్రాలు.

Vaishnav Teja Next movie titled Aadikeshava: అయితే కొంతమంది హీరోలు మాత్రం ప్రేక్షకుల దృష్టితో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. టాలీవుడ్ లో మాస్ సినిమాలకు ఆదరణ ఎక్కువ అని చెప్పవచ్చు.. కానీ మొత్తం మాస్ యాంగిల్ చూపిస్తే సినిమా హిట్ అవుతుంది అన్న గ్యారెంటీ కూడా లేదు.

మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన పెద్ద పెద్ద హీరోల సినిమాలే కంటెంట్ కాస్త అటు ఇటు అయినా కారణంతో బోల్తాపడడం మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రెండు సినిమాలు పూర్తి అయ్యాయో లేదో వెంటనే మాస్ లీగ్ లో ఎంటర్ అవ్వాలి అని వైష్ణవ తేజా తెగ తాపత్రయ పడుతున్నాడు.

కొత్తగా అతను చేస్తున్న ఆది కేశవ మూవీ లో హై వోల్టేజ్ మాస్ ఎలిమెంట్స్ ఉన్నాయన్న విషయం చిత్రం గ్లింప్స్ లో (Glimpse) తెలుస్తోంది. భారీ టైటిల్, తొడలు కొట్టడం, చిటికేస్తే గాల్లోకి లేసే వెహికల్స్…ఒక్క దెబ్బకి గింగిరాలు తిరిగి కింద పడే విలన్స్…ఇలా హైమాస్ ఎలివేషన్ గ్లింప్స్ లో కనిపిస్తుంది.

అయితే మంచి రొమాంటిక్ మరియు ఎమోషనల్ మూవీ అయిన ఉప్పెన చిత్రం తర్వాత వైష్ణవ తేజకు ఓ ఇమేజ్ అనేది ఏర్పడింది. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు ఆ ఇమేజ్ను నిలబెట్టలేకపోయాయి. దీంతో ఈ కుర్ర హీరో ప్రస్తుతం మా స్ స్టార్ అవతారం ఎత్తారు.

మాస్ హీరోగా ప్రజలను మెప్పించడం అంత సులువైన విషయం కాదు. రొమాంటిక్ పాత్రలను వదిలి బలవంతంగా మాస్ పాత్రలోకి ఎంటర్ అయితే ఫలితాలు ఎంత దారుణంగా ఉంటాయి అనేది నితిన్ ,అఖిల్ ,శర్వానంద్ లాంటి హీరోలను చూసి తెలుసుకోవచ్చు.

- Advertisement -
Vaishnav Teja and Sreeleela Next movie titled Aadikeshava

ఇప్పుడు మాస్ హీరోలుగా పేరుపొందిన పవన్ కళ్యాణ్ ,బాలకృష్ణ ,రవితేజ.. వీళ్లంతా ఒక్కసారిగా మాస్ పాత్రలు చేయలేదు. వయసు ఇమేజ్ కి తగ్గ పాత్రలు చేసుకుంటూ క్రమంగా తమలోని మాస్ యాంగిల్ ను బయటకు తెచ్చారు…. కాబట్టే వారు ఇప్పుడు సాలిడ్ మాస్ మూవీస్ వరుస పెట్టి చేయగలుగుతున్నారు. మరి వైష్ణవ తేజ ఈ చిన్న లాజిక్ మిస్ అయినట్లు కనిపిస్తుంది.

Web Title: Aadikeshava, Sreeleela, Aadikeshava First Glimpse, Panja Vaishnav Tej, Panja Vaishnav Tej new movie title, Panja Vaishnav Tej upcoming movies, Aadikeshava Glimpse, Aadikeshava cast crew details

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY