vakeel Saab producer dil raju petition on photos and photos leaked

Pawan Kalyan Vakeel Saab Leaks: కరోనా వైరస్ కారణంగా ఏర్పడిన లాక్‌డౌన్ వల్ల సుమారు ఎనిమిది నెలలు విరామం తీసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా కాస్త గ్యాప్ తీసుకున్న ఆయన ఆదివారం ‘వకీల్ సాబ్’ షూటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక కోర్టు సెట్‌లో పవన్ కళ్యాణ్‌పై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. సినిమాకు కీలకమైన కోర్టు సీన్స్‌ను ఈ షెడ్యూల్‌లో షూట్ చేస్తున్నారట.

అయితే ఇపుడు సోషల్ మీడియా లో ఒక న్యూస్ వైరల్ అవుతుంది ‘వకీల్ సాబ్’కు సంబంధించి. ‘వకీల్ సాబ్’ షూటింగ్ లీక్స్ గురించి ప్రొడ్యూసర్ దిల్ రాజు కోర్టులో పిటిషన్ వేసినట్టు పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’ పిక్స్, వీడియోలను లీక్ చేసినా.. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసినా రూ.5 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించాలని దిల్ రాజు ఈ పిటిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరూ లీక్డ్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దని మెగా అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు.