వకీల్ సాబ్ లో ఆమె కూడా జాయిన్ అయ్యింది..!

0
475
Vakeel Saab Movie Shooting Updates

Pawan Kalyan: Vakeel Saab Shooting: పవన్ 26వ సినిమా వకీల్ సాబ్ చిత్రీకరణ దాదాపు ఆరు నెలల తర్వాత ఇటీవలే షూటింగ్ పునః ప్రారంభం అయ్యింది. గత రెండు మూడు వారాలుగా షూటింగ్ జరుగుతున్నా పవన్ మాత్రం ఇప్పటి వరకు జాయిన్ అవ్వలేదు. పవన్ లేకుండా ఉన్న సీన్స్ ను దర్శకుడు చిత్రీకరిస్తున్నాడు. ఈ మూవీ చివ‌రి షెడ్యూల్ షూట్ లో నివేదా థామ‌స్ జాయిన్ అయింది. ఈ విష‌యాన్ని ఫొటో ద్వారా తెలియ‌జేస్తూ..మ‌ళ్లీ షూటింగ్ కు తిరిగి రావ‌డం ఆనందంగా ఉంద‌ని నివేదా ట్వీట్ చేసింది.

నివేధా థామస్ సోలో సీన్స్ చిత్రీకరణ పూర్తి అయ్యే సమయానికి పవన్ కూడా టీంతో జాయిన్ అవ్వబోతున్నాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఈనెల 26 నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. దీని కోసం పవన్ కళ్యాణ్ 20 రోజుల కాల్షీట్లు కేటాయించారట. ఈ 20 రోజుల్లో పవన్ కళ్యాణ్ పోర్షన్ మొత్తం పూర్తయిపోతుందని అంటున్నారు. అంతేకాదు, త్వరలోనే టీజర్‌తో ఫ్యాన్స్‌ను పవన్ సర్‌ప్రైజ్ చేయనున్నారని టాక్.

 

Previous articleకాజల్ పెళ్లి ముహూర్తం ఫిక్స్..!
Next articleడైనమిక్ డైరెక్టర్ మారుతీ బర్త్డే స్పెషల్ ఇంటర్వ్యూ