Prabhas Salaar లో మరో బాలీవుడ్ బ్యూటీ

0
28
Vani Kapoor Key role in Prabhas Salaar Movie

Salaar Cast: ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘సలార్‌’. హోంబలే ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటికే ఓ షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. త్వరలో కొత్త షెడ్యూల్‌ ప్రారంభించుకోనుంది. తాజాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ (Salaar) మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‏డేట్ ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తోంది.

ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతిహాసన్‌ (Shruti Haasan) నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ కీలక పాత్ర కోసం చిత్ర బృందం మరో నాయికనూ రంగంలోకి దించుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడా పాత్ర కోసం దర్శక నిర్మాతలు బాలీవుడ్‌ నాయిక వాణీ కపూర్‌ను (Vaani Kapoor) ఖరారు చేశారని సమాచారం. అయితే సినిమాలోని ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే ఓ కీలక పాత్ర లో ఆ అమ్మడు కనిపించనుందని ప్రచారం వినిపిస్తోంది.

త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందని టాక్ నడుస్తోంది. ప్రభాస్, పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా నటించిన “రాధేశ్యామ్” సినిమా షూటింగ్ పూర్తైందని.. తర్వలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ ఆ మూవీ సెట్స్ పైనే ఉన్నట్లుగా తెలుస్తోంది.