ఎన్‌టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్

184
Varalakshmi Sarath Kumar in NTR Trivikram Movie
Varalakshmi Sarath Kumar in NTR Trivikram Movie

యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ వరుస సినిమాలను ఓకే చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కొమరం బీమ్ పాత్రలో కనిపించనున్న ఎన్‌టీఆర్ తన తదుపరి సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేయనున్నారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనుంది.

 

 

పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో గొప్ప నటి చేరనున్నారంట. ఈ ఏడాది క్రాక్ సినిమాతో అందరినీ మెప్పించిన వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ సినిమాలో కూడా ఓ పవర్ ఫుల్ రాజకీయ నాయకురాలిగా కనిపించనున్నారంట. దర్శకుడు త్రివిక్రమ్ కూడా వరలక్ష్మిని సినిమాలోకి స్వాగతించేందుకు సిద్ధమయినట్లు వార్తలు వస్తున్నాయి.

 

 

ఈ సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే పేరు ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఈ పేరును ఫిక్స్ చేసినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారంట. ఇదివరకే త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఉపేంద్ర చేశారు.

 

 

అందుకే ఇప్పుడు ఎన్‌టీఆర్30లో కూడా ఉపేంద్ర చేసేందుకు ఓకే చెప్పారంట. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలోని నటీనటుల విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అతి త్వరలో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని టాక్ నడుస్తోంది. ఈ వార్తల్లో నిజానిజాల కోసం అప్పటి వరకు వేచి చూడాల్సిందే.