‘పుష్ప’లో మరో యంగ్ టాలెంటెడ్ హీరోయిన్..!

0
723
Varsha bollamma Sister Role In Allu Arjun Pushpa film

Allu Arjun Pushpa: అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న సినిమా Pushap గురించి ప్రేక్షకులు ఎప్పటినుంచే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించిన పోస్టర్స్, వీడియోలతో పుష్ప పై హైప్ క్రియేట్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది.

ఇందులో అల్లుఅర్జున్ ఎర్రచందనం స్మగ్లర్‌ గా కనిపించనున్నారు. భారీ బడ్జెట్‏తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి.. ఎప్పటికప్పుడు లెటేస్ట్ అప్డేట్స్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే కథలో కొన్ని మార్పులతో పాటు కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉందట. ఆ పాత్రలో టాలెంటెడ్ బ్యూటీ Varsha Bollamma నటించబోతుందని తెలుస్తోంది.

ఈ సినిమాలో పుష్పరాజ్ చెల్లెలి పాత్రలో యంగ్ హీరోయిన్ నటించనున్నట్లుగా సమాచారం. ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాజేశ్‏ను ఎంపిక చేశారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ రోల్ కోసం వర్ష బొల్లమ్మను సెలక్ట్ చేసినట్లుగా టాక్ వినిపిస్తోంది.

Varsha bollamma Sister Role In Allu Arjun Pushpa film

వర్ష తెలుగులో రెండు సినిమాలు చేసింది. మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో హీరోయిన్‏గా నటించింది. అయితే ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా నటిస్తోంది.

Previous articleవిజయ్ దేవరకొండ కొత్త బిజినెస్.. !
Next articleబిగ్ బాస్ 5 రెండో వారం నామినేషన్స్ లిస్ట్ ‏