Varun Tej – Lavanya engagement date fix: టాలీవుడ్ నటీనటులు వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి ఎట్టకేలకు నిశ్చితార్థం చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం వైరల్ అవుతుంది, ఇద్దరు చాలా సంవత్సరాల నుండి రిలేషన్ షిప్‌లో ఉన్నారు, అంతకుముందు కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా సార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరగక వీళ్ళకి సంబంధించిన పిఆర్ టీం వాటిని ఖండించేది. అందుతున్న సమాచారం ప్రకారం వరుణ్ తేజ్ అలాగే లావణ్య త్రిపాఠి జూన్ 9 న నిశ్చితార్థం మరియు వివాహం తరువాత ఉంటుంది అని తెలుస్తుంది.
Varun Tej – Lavanya engagement date fix: వీళ్ళిద్దరి నిశ్చితార్థం ఇంట్లో లేదా హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో కుటుంబ సమేతంగా ఉంటుందని అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం ఇది కూడా మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ వచ్చే విధంగా ఫిక్స్ చేశారంట.. ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యే అవకాశం ఉందని, అదే రోజు పెళ్లి తేదీని ప్రకటిస్తారని అంటున్నారు.
వరుణ్ (Varun Tej) మరియు లావణ్య (lavanya Tripati) 2017 లో శ్రీను వైట్ల యొక్క మిస్టర్ సెట్స్‌లో కలుసుకున్నారు మరియు అప్పటి నుండి డేటింగ్ చేస్తున్నారు. సినిమా వర్కవుట్ కానప్పటికీ, ఆఫ్-స్క్రీన్ వారి కెమిస్ట్రీ పని చేసి, ఇద్దరూ ప్రేమలో పడ్డారు. లావణ్య ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు మరియు డెహ్రాడూన్‌లో పెరిగారు మరియు అందాల రాక్షసి చిత్రంతో తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేసింది.

వరుణ్ తేజ్ కొణిదెల మెగా ఫ్యామిలీ నుండి వచ్చాడనీ, అతని తండ్రి చిరంజీవికి సోదరుడైన నటుడు మరియు నిర్మాత నాగబాబు అని అందరికీ బాగా తెలుసు. వరుణ్ తన వైవిధ్యమైన పాత్రలు మరియు నటనతో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన తదుపరి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో “గాండీవధారి అర్జున”లో నటించనున్నారు.