పవర్ ఆఫ్ ‘గని’ టీజర్: వరుణ్ బర్త్ డే స్పెషల్

Ghani teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ (Varun Tej) చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు.

జనవరి 19న వరుణ్ తేజ్ (Varun Tej) పుట్టిన రోజు సందర్భంగా టీజర్ (Ghani teaser) విడుదల చేసారు దర్శక నిర్మాతలు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ (Varun Tej) మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఇందులో బాక్సర్‌గా నటిస్తున్నారు వరుణ్ తేజ్ (Varun Tej). దీనికోసం బాక్సింగ్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. ప్రొఫెషనల్ బాక్సర్స్‌తో కలిసి సినిమాలో నటిస్తున్నారు వరుణ్ తేజ్.

సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ (Ghani teaser) సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.

 

Related Articles

Telugu Articles

Movie Articles