Homeసినిమా వార్తలుVT13 సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ..!!

VT13 సినిమాతో వరుణ్ తేజ్ బాలీవుడ్ ఎంట్రీ..!!

Varun Tej VT13 Launch: వరుణ్ తేజ్ కెరీర్ స్టార్ట్ దగ్గరనుంచి ఇప్పటివరకు వైవిధ్యమైన పాత్రలు చేసుకుంటూ తన అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. తను చేసే ప్రతి పాత్రలోనూ కొత్తదనాన్ని చూపించుకుంటూ ముందుకు సాగుతూ టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివరకు వరుణ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీ కే పరిమితం కాగా, ఇప్పుడు తన రాబోయే VT13 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు.

తమ తొలి తెలుగు- హిందీ ద్విభాషా చిత్రం ‘మేజర్’తో ఘన విజయాన్ని అందుకున్న సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ తో కలసి తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (VT13) కథానాయకుడిగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్ఫూర్తితో భారీ యాక్షన్ డ్రామాతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురాబోతోంది.

వరుణ్ తేజ్ VT13 చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. గతంలో యాడ్-ఫిల్మ్ మేకర్ గా సినిమాటోగ్రాఫర్ గా కూడా పని చేసిన ప్రతాప్ సింగ్. ఈ చిత్రం యధార్ద సంఘటనల ఆధారంగా దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్ గా ఉండబోతుంది. ఫ్రంట్ లైన్ హీరోల స్ఫూర్తి, వైమానిక దాడులతో పోరాడుతున్నప్పుడు వారు ఎదుర్కొనే సవాళ్లను మునుపెన్నడూ చూపని విధంగా రూపొందబోతోంది.

ఈ సినిమా ని 2022 నవంబర్ లో ఈ భారీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని ఆలాగే 2023లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన పోస్టర్ ని లాంచ్ చేశారు. ఈ చిత్రం తెలుగు. హిందీ భాషలలో ఏకకాలంలో చిత్రీకరణ జరుపుకోనుంది.

ఈ రోజు హైదరాబాద్ లోని చిత్ర నిర్మాణ సంస్థ ఆఫీస్ లో గ్రాండ్ జరిగిన పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైయింది. పద్మజా కొణిదెల కెమరా స్విచ్ ఆన్ చేయగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లాప్ ఇచ్చారు. తొలి సన్నివేశానికి బాపినీడు గౌరవ దర్శకత్వం వహించారు. వరుణ్ తేజ్ VT13 సినిమా పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY