Varun Tej Gaddhala Konda Ganesh and Nani Gangleade Box office Report
Varun Tej Gaddhala Konda Ganesh and Nani Gangleade Box office Report

ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఏ సినిమాలు ఏ రేంజ్ లో ఆడుతున్నాయో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా గద్దలకొండ గణేష్ సినిమాకి వస్తే.. హీరో వరుణ్ తేజ్ ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తో మొదలైంది. మొదటి రెండు రోజులు ముగిసే సమయానికి ఎ, బి, సి కేంద్రాల్లో మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావాలంటే.. ఈ వారం కూడా డీసెంట్ కలెక్షన్స్ ను రాబట్టాలి. ఇక రెండో సినిమా ‘బందోబస్త్’ విషయానికి వస్తే.. తమిళ్ స్టార్ హీరో సూర్య హీరోగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ‘బందోబస్త్’ బాక్సాఫీస్ వద్ద బిలౌవ్ ఏవరేజ్ ఓపెనింగ్స్ ను సాధించింది. మొత్తానికి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చాలా కష్టపడుతోంది. ఓవరాల్ గా ఈ చిత్రం తెలుగులో సూర్యకి మరో ప్లాప్ ఇచ్చేలా కనిపిస్తోంది.

అలాగే గ్యాంగ్ లీడర్ రిపోర్ట్స్ చూస్తే.. మొదటి మూడు రోజుల్లో, గ్యాంగ్ లీడర్ పెట్టిన పెట్టుబడిలో దాదాపు యాభై శాతం రికవరీ చేయగలిగింది. కానీ ఆ తరువాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడంలో పూర్తిగా విఫలమైంది. ప్రస్తుత ధోరణిని చూస్తే, గ్యాంగ్ లీడర్ బాక్సాఫీస్ వద్ద సగటు వసూళ్లతోనే ముగుస్తుందని స్పష్టమవుతోంది. ఇక చివరిగా భారీ అంచనాల మధ్య విడుదలైన సాహో తెలుగు రాష్ట్రాలతో పాటు, సౌత్ లో ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. భారీ వసూళ్లు సాధించినప్పటికీ మూవీని అధిక ధరలకు అమ్మడం వలన సాహో చాలా చోట్ల నష్టాలను మిగిల్చింది. ఓవరాల్ గా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సినిమా స్థాయికి తగ్గ కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.