Varun Tej Valmiki’s ceded and Vizag pre-release business details
Varun Tej Valmiki’s ceded and Vizag pre-release business details

హీరో వరుణ్ తేజ్, ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాంతో సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. అయితే ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను వీక్షించి.. ‘సినిమా చాలా బాగుందని మెచ్చుకున్న సంగతి తెలిసింది. దాంతో సినిమా కలెక్షన్స్ పెరిగాయి.

మొదటి ఐదు రోజుల్లోనే చిత్రం రూ.30 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక వీక్ డేస్ లో వసూళ్లు డ్రాప్ అవకుండా ఉండేందుకు చిత్ర టీమ్ జైత్రయాత్ర పేరుతో టూర్ ప్లాన్ చేసుకుని ముఖ్యమైన నగరాల్లో పబ్లిసిటీ చేస్తున్నారు. విజయవాడ, ఏలూరు, గుంటూరు, హనుమాన్ జంక్షన్ ప్రాంతాల్లో విద్యార్థుల్ని, మీడియాని పలకరించిన టీమ్ రేపు విశాఖలో సక్సెస్ మీట్ జరపనున్నారు. మొత్తానికి కలెక్షన్స్ పడిపోకుండా ‘గద్దలకొండ గణేష్’ బాగా ప్రయత్నం చేస్తున్నాడు.

కాగా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా మరో కొత్త క్యారెక్టర్‌ లో కనిపించాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ కూడా సినిమాలో హైలెట్ అయ్యాయి. ఇక ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించగా.. పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.