Homeసినిమా వార్తలుఆక‌ట్టుకుంటోన్న వ‌రుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున టీజ‌ర్.!!

ఆక‌ట్టుకుంటోన్న వ‌రుణ్ తేజ్ గాంఢీవధారి అర్జున టీజ‌ర్.!!

Varun Tej next movie Gandeevadhari Arjuna teaser out now, Gandeevadhari Arjuna movie release date, Praveen Sattaru and Varun Tej latest movie news, Gandeevadhari Arjuna cast crew, Gandeevadhari Arjuna Telugu movie

దేశ ర‌క్ష‌ణ‌కు సంబంధించి పెద్ద స‌మ‌స్య ఏర్ప‌డుతుంది. ఈ ఎమర్జెన్సీ నుంచి కాపాడే వ్యక్తి ఎవ‌రా? అని అంద‌రూ ఆలోచిస్తుంటే.. అంత హై రిస్క్ నుంచి కాపాడే ఏకైక వ్య‌క్తిగా అర్జున్ వారికి క‌నిపిస్తాడు. ఇంత‌కీ ఆ ఎమ‌ర్జెన్సీ ప‌రిస్థితులు ఏంటి? అర్జున్ ఎవ‌రు?  త‌నేం చేశాడు? అనే వివ‌రాలు తెలియాలంటే మాత్రం ఆగ‌స్ట్ 25న రిలీజ్ అవుతున్న‌ ‘గాంఢీవధారి అర్జున’ సినిమా చూడాల్సిందేనంటున్నారు స్టార్ ప్రొడ్యూస‌ర్ బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌. 

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాంఢీవధారి అర్జున’. ఎప్ప‌టిక‌ప్పుడు డిఫ‌రెంట్ మూవీస్‌తో మెప్పించే వ‌రుణ్ తేజ్ ఈసారి ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌తో మెప్పించ‌టానికి రెడీ అయ్యారు. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ మూవీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. 

వ‌రుణ్ తేజ్ లుక్ ప‌రంగా స్టైలిష్‌గా క‌నిపిస్తూనే యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టేశారు. ప్ర‌తి స‌న్నివేశం వావ్ అనిపించేలా భారీగా తెర‌కెక్కించారు. స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన తీరు, సౌండ్‌, విజువ‌ల్స్ ఈ స‌న్నివేశాలు మ‌న‌ల్ని ఓ డిఫ‌రెంట్ యాక్ష‌న్ మోడ్‌లోకి తీసుకెళుతున్నాయి. కచ్చితంగా యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయన‌టంలో సందేహం లేదు.. వ‌రుణ్ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో మెప్పించ‌బోతున్నారు. 

ఈ టీజ‌ర్‌లో కీల‌క పాత్రలో న‌టిస్తోన్న నాజ‌ర్‌తోపాటు హీరోయిన్ సాక్షి వైద్య కూడా క‌నిపించింది. అయితే యావ‌త్ దేశానికి ఎదురైన రిస్కీ ప‌రిస్థితి ఏంట‌నే విష‌యాన్ని మేక‌ర్స్ రివీల్ చేయ‌లేదు. ఇప్ప‌టికే ప్రీ టీజ‌ర్, పోస్ట‌ర్స్‌తో సినిమాపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా టీజ‌ర్‌తో ఈ అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.  షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌టంలో బిజీగా ఉంది. ఆగ‌స్ట్ 25న సినిమాను గ్రాండ్ రిలీజ్ కానుంది. 

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో  ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

Varun Tej next movie Gandeevadhari Arjuna teaser out now, Sakshi Vaidya, Gandeevadhari Arjuna movie release date, Varun Tej latest movie news, Gandeevadhari Arjuna cast crew, Gandeevadhari Arjuna Telugu movie

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY