Varun Tej Pooja hegde Emotional Deleted Scene From Gaddalakonda Ganesh
Varun Tej Pooja hegde Emotional Deleted Scene From Gaddalakonda Ganesh

హీరో వరుణ్ తేజ్, ఎనర్జిటిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ చిత్రం మాస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దాంతో సినిమా మంచి విజయాన్ని నమోదు చేసింది. ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమా పై పొగడ్తల వర్షం కురిపించారు. కాగా కొద్దిరోజులుగా చిత్ర బృందం గడ్డలకొండ గణేష్ చిత్రంలోని తొలగించిన సన్నివేశాలను యూట్యూబ్ లో విడుదల చేస్తూ మూవీకి మరింత ప్రచారం కల్పించే పనిలో పడ్డారు మేకర్స్. ఇప్పటికే పూజా, వరుణ్ ల మధ్య నడిచే ఎమోషనల్ సన్నివేశాన్ని రిలీజ్ చేశారు. పూజ ఊరి నుండి పారిపోయి పెళ్లి చేసుకుందాం అని బ్రతిమిలాడుతుంటే, వరుణ్ ఊరు వదిలి వెళ్ళేదే లేదంటూ ఖరాఖండీగా చెప్పే సన్నివేశం బాగుంది. ఈ ఒక్కసారి నామాట విను నాన్న అంటూ పూజా హెగ్డే చాల ఎమోషనల్ నటిస్తూ ఆకట్టుకుంది.

కాగా విభిన్నమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాలో కూడా మరో కొత్త క్యారెక్టర్‌ లో కనిపించాడు. అలాగే హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ కూడా సినిమాలో హైలెట్ అయ్యాయి. ఇక ప్రముఖ తమిళ్‌ యంగ్ హీరో అధర్వ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించగా.. పూజా హెగ్డే, మృణాలిని రవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా నిర్మించారు.