మెగా హీరో వరుణ్ తేజ్ తన మొదటి సినిమాతోనే ప్రత్యేక గుర్తింపు పొండాదు. ఆ తర్వాత తొలిప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ వంటి హిట్లు అందుకుని కొత్త సినిమాలతో చెలరేగుతున్నాడు. ఇప్పుడు తాజాగా తన నూతన చిత్రం కోసం బాక్సర్‌గా మారాడు. వరుణ్ తేజ్ పదవ చిత్రం బాక్సింగ్ నేపథ్యంలో వస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్, టైటిల్‌లను నేడు విడుదల చేసారు.
వరుణ్ తేజ్ పుట్టిన రోజు సందర్బంగా అప్డేట్ వచ్చేసింది .అయితే ఈ సినిమాకి గని అనే పేరును ఫిక్స్ చేసారు . బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో పేరు గని అందుకే సినిమాకి కూడా అదే పేరు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. అంతేకాకుండా ఇందులో ఫాదర్ సెంటిమెంట్ కూడా ఉంటుందట. ఈ పాత్రలో స్టార్ హీరో ఉపేంద్రా చేయనున్నాడు. అంతేకాకుండా వరుణ్ తేజ్ కోచ్‌గా బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి కనిపించనున్నాడు.