‘రాజా విక్రమార్క’ టీజర్: ఎన్ఐఏ ఆఫీసర్‌గా కార్తికేయ అదుర్స్

0
1234
Varun Tej Unveils Kartikeya Raja Vikramarka Teaser

Raja Vikramarka Teaser: కార్తీకేయ గుమ్మకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ”రాజా విక్రమార్క”. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఎన్ఐఏ ఆఫీసర్ గా కార్తికేయ కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – ఫస్ట్ లుక్ – కాన్సెప్ట్ వీడియో ఆకట్టుకున్నాయి. తాజాగా ఆయన నటించిన రాజా విక్రమార్క సినిమా నుంచి టీజర్ బయటకు వచ్చింది. వరుణ్ తేజ్ కాసేపటి క్రితమే టీజర్‌ను వదిలారు.

కొత్తగా నియమించబడిన NIA అధికారి అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్ లో అనుకోకుండా ఒక నిందితుడైన నైజీరియన్ ని కాల్చి చంపినట్లు టీజర్ లో చూపించారు.  ‘చిన్నప్పుడు సూపర్ స్టార్ క‌ృష్ణ, పెద్దయ్యాక టామ్ క్రూజ్ చిత్రాలను చూసి బాగానే ఇన్‌స్పైర్ అయి అలాంటి జాబ్ ఎంచుకున్నటున్నాడు మన హీరో విక్రమ్. కానీ సరదా తీరిపోతోంది.. ఇంక నా వల్ల కాదు అని చేతులెత్తేసినట్టు మనకు టీజర్‌లో కనిపిస్తోంది.

ఇందులో హై ఇంటెన్స్ యాక్షన్ తో పాటుగా హ్యూమర్ కూడా ఉన్నట్లు హింట్ ఇచ్చారు. అయితే టీజర్ విడుదల చేసిన వరుణ్ తేజ్.. హీరో కార్తికేయ సినిమా ఎంపికల పట్ల సంతోషాన్ని, ప్రేమను వ్యక్తం చేశారు.

ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలో సాయి కుమార్, తనికెళ్ల భరణి, పశుపతి, హర్ష వర్దన్, సుధాకర్ కొమాకుల, సూర్య, జెమినీ సురేష్ వంటి వారు నటించారు. ఈ మూవీకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతాన్ని అందిస్తున్నారు.

Previous articleకనీవిని ఎరుగని రీతిలో రామ్ చరణ్ మూవీ లాంచ్..!
Next articleSai Pallavi Latest Pics