Varun Tej Valmiki Movie Videos songs, Teaser, Trailer, Stills, Preview
Varun Tej Valmiki Movie Videos songs, Teaser, Trailer, Stills, Preview

వరుణ్ తేజ్ విలన్ గా తమిళ్ హీరో అథర్వ మెయిన్ లీడ్ గా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా వాల్మీకి.ఈ సినిమా నుండి వరుణ్ తేజ్ లుక్ ఒకటి బయటికి రాగానే హీట్ పెరిగిపోయింది.హరీష్ శంకర్ కూడా అనవసరంగా రిస్క్ చెయ్యకుండా తనకి అచొచ్చిన రీమేక్ నే నమ్ముకున్నాడు.ఎప్పుడో వచ్చిన ‘జిగర్తాండ’కి తన మార్క్ టచ్ ఇచ్చాడు.ఇక్కడ వరకు బాగానే ఉన్నా సినిమాకి అతి కీలకం అయిన కంటెంట్ విషయంలో హరీష్ శంకర్ ఎలాంటి ఫామ్ లో ఉన్నాడు అనేది అందరిలో ఉన్న డౌట్.

అయితే వాల్మీకి నుండి ఫస్ట్ సింగిల్ బయటికి వచ్చి ఆ అనుమానాలకు చెక్ పెట్టింది.జర్ర జర్ర అంటూ సాగే ఈ మాస్ పాట సూపర్ కిక్ ఇచ్చేలా ఉంది.అవ్వడానికి లిరికల్ వీడియో అయినప్పటికీ ఇందులో చూపించిన వరుణ్ తేజ్ మేనరిజం వావ్ అనిపించేస్తుంది.కేవలం లుక్ మాత్రమే కాదు నటనలో కూడా అరిపించేసాడు అని అర్థమవుతుంది.ఇక డింపుల్ హయతి ఫ్రెష్ అందాలు కూడా ఆకట్టుకుంటున్నాయి.ఈ లిరికల్ వీడియో తో అందరికంటే ఎక్కువ సర్ప్రైజ్ చేసింది మిక్కీ.జె.మేయర్.మెలోడీస్ కి కేర్ ఆఫ్ అడ్రెస్ లాంటి ఫస్ట్ టైం మాస్ ట్యూన్ తో ఫుల్ మర్క్స్ స్కోర్ చెయ్యగలను అని ప్రూవ్ చేసుకున్నాడు.ఓవర్ ఆల్ గా వాల్మీకి ఫస్ట్ బాల్ అనే సిక్స్ గా మలిచాడు.మరి ఈ సాంగ్ ఇచ్చిన జోష్ ని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడు అనేది చూడాలి.