యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు నటుడిగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం సింహాద్రి. ఈ మూవీ లో ఒక్కొక్క సీను థియేటర్లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ క్రియేట్ చేసింది అనడంలో సందేహం లేదు. 2003లో విడుదలైన ఈ చిత్రం అప్పటిలో భారీ సెన్సేషన్ను సృష్టించి బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను నెలకొంది. ఎన్టీఆర్ కెరియర్ లో కూడా భారీ కలెక్షన్ సాధించిన చిత్రంగా సింహాద్రి గుర్తింపు పొంది.
ఆది చిత్రంతో ఎన్టీఆర్ కి వచ్చిన మాస్ గుర్తింపును నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లిన మూవీ సింహాద్రి. ఆ చిత్రంలో ఎన్టీఆర్ పర్ఫామెన్స్ చూస్తే 20 ఏళ్ల కుర్రాడు ఇంత మాస్ పర్ఫామెన్స్ ఎలా చేస్తాడు అని ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. సీనియర్ స్టార్ హీరోలు సైతం ముక్కును వేలు వేసుకునే విధంగా ఎన్టీఆర్ ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం ఈ చిత్రం 20 సంవత్సరాల తరువాత ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ కాబోతోంది.
కేవలం రీ రిలీజ్ కాదండి.. ఏకంగా ఈ చిత్రానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా చేయడం విశేషం. అయితే ఈ వేడుక సందర్భంగా గోపీచంద్ మల్లినేని మరియు నిర్మాతలు రవిశంకర్ హాజరయ్యారు. గోపీచంద్ మలినేని డైరెక్షన్లో రీసెంట్గా సంక్రాంతికి విడుదలైన బాలకృష్ణ వీరసింహారెడ్డి మాస్ బీభత్సాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. సింహాద్రి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న గోపీచంద్ విరసింహారెడ్డి చిత్రంతో సింహాద్రి కి ఉన్న కామన్ పాయింట్ గురించి వివరించారు.

సింహాద్రి చిత్రంలో ఇంటర్వెల్ సీన్లో భూమిక ఎన్టీఆర్ ను పొడిచేసి సీన్ రిఫరెన్స్ తోటి వీర సింహారెడ్డి ఇంటర్వల్ సీన్ డిజైన్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రెండు సీన్లు కూడా విపరీతమైన రెస్పాన్స్ తెచ్చుకున్నాయని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంక్స్ తెప్పించడంతోపాటు లైఫ్ లాంగ్ మెమొరబుల్ గా ఉంటాయని పేర్కొన్నారు. మా సినిమాకు న్యాయం చేయాలి అన్న…ఒక మంచి మాస్ సీ న్ ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేయాలి అన్న అది కేవలం ఎన్టీఆర్ లాంటి గొప్ప నటుడికే సాధ్యపడుతుందని గోపీచంద్ అన్నారు.