Venkatesh about Jigarthanda DoubleX Pre Release Event, Venkatesh speech, Raghava Lawrence and S. J. Suryah latest movie, Jigarthanda DoubleX Review and rating
రాఘవ లారెన్స్, ఎస్.జె.సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన హై యాక్షన్ డ్రామా ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ దీపావళి సందర్బంగా ఈ మూవీ నవంబర్ 10న రిలీజ్ అవుతుంది. వెర్సటైల్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో స్టోన్ బెంచ్ ఫిలింస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని కార్తీకేయన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మేకర్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని బిగ్ టికెట్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్ ట్రైలర్ అదిరిపోయింది. కార్తీక్ సుబ్బరాజ్ టేకింగ్ ఎలా ఉంటుందో మరోసారి ఈ ట్రైలర్‌తో మనకు చూపించాడు. ఔట్ స్టాండింగ్‌గా ఉంది. మూవీ తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందనే గట్టి నమ్మకం ఉంది. లారెన్స్, ఎస్.జె.సూర్య వంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఇందులో నటించారు.
నా కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్ అయిన పెళ్లి కళ వచ్చేసిందే బాల.. ను లారెన్స్ మాస్టరే కంపోజ్ చేశారు. తను కొరియోగ్రాఫర్ నుంచి బెస్ట్ యాక్టర్ రేంజ్‌కి చేరుకున్నారు. ఎస్.జె.సూర్య, నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఖుషి సినిమాను డైరెక్టర్‌గా మనకు పరిచయమే. ఆయన పెర్ఫామెన్స్‌లను ఎలా రాబడుతారో మనకు తెలిసిందే. తనొక అద్భుతమైన యాక్టర్. కార్తీక్ సుబ్బరాజ్ గురించి చెప్పాలంటే తనొక కల్ట్ డైరెక్టర్. జిగర్ తండ డబుల్ ఎక్స్ ట్రైలర్ చూడగానే ఎగ్జయిట్ అయ్యాను.
తను నాకోసం త్వరలోనే ఓ స్క్రిప్ట్ చేస్తాడని అనుకుంటున్నాను. సంతోష్ నారాయణన్ గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తను కబాలిలో రజినీకాంత్‌గారి ఇంట్రడక్షన్ మ్యూజిక్‌కి ధీటుగా ఈరోజుకి ఎవరూ మ్యూజిక్ ఇవ్వలేదు. నాతో సైంధవ్ సినిమాకు వర్క్ చేస్తున్నారు. గురు సినిమాకు ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నప్పుడు నాతో సంతోష్ పాట కూడా పాడించాడు. నవంబర్ 10న జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీని థియేటర్‌లో చూసి బ్లాక్ బస్టర్ చేయాలి’’ అన్నారు.
ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ అలాగే ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేటట్టు చేశారు మేకర్స్. అలాగే ఈ సినిమా కథ 1975 నాటి రెట్రో స్టైల్‌లో సాగుతుందని ఈ ట్రైలర్ ద్వారా మేకర్స్ వెల్లడించారు. ఇక ఈ సినిమాలో గిరిజనులను కూడా చూపించడంతో కార్తీక్ సుబ్బరాజు ఏం ప్లాన్ చేసాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 10న తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.