Venkatesh, Rana Web Series: ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ లు దూసుకుపోతున్నాయి. సినిమాను ఓటిటి అధిగమించే రోజు ఎంతో దూరంలో లేదని తెలుసుకుని అటు అడుగేస్తున్నారు. తాజాగా వెంకటేష్, రానాతో కలిసి ఓ వెబ్ సిరీస్ చేయబోతున్నారు.
సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో రానా కలిసి ఓ వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ కోసం చేయడానికి డిసైడ్ అయిపోయారు. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన వార్తలు గతంలోనే గ్యాసిప్ లుగా వినిపించాయి. ఇప్పుడు వాటినే నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ధృవీకరించింది.
హాలీవుడ్ లో తెరకెక్కిన క్రైమ్ సిరీస్ ‘రే డోనవన్'(Ray Donovan) అక్కడ సూపర్ సక్సెస్ అయింది. చాలా మంది ఇండియన్స్ కూడా ఈ సిరీస్ చూసేశారు. ఇప్పుడు ఈ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ గా ‘రానా నాయుడు’ని తెరకెక్కిస్తున్నారు.
Also Read: అవికా గోర్ వెబ్ సిరీస్ ‘నెట్’ టీజర్ విడుదల..!
దీనికి రానా నాయుడు అనే పేరు పెట్టారు. దీన్ని లోకోమోటివ్ గ్లోబల్ ఇన్ కార్పొరేషన్ సంస్థ నిర్మిస్తుంది. కరణ్ అన్షుమన్, సుపర్న్ వర్మ దర్శకత్వం వహిస్తారు. ఆల్రెడీ ఇది సక్సెస్ అయిన కథే కాబట్టి తెలుగులో కూడా ఈ క్రైమ్ సిరీస్ సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు.
Also Read: వెబ్ సిరీస్‌లో సాయిపల్లవి..!