ఎఫ్3 ట్రైలర్ విడుదల: డబల్ ఫన్ రైడ్

విక్టరీ వెంకటేష్ , మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా F3. ఈ సినిమా అన్ని హంగులు పూర్తి చేసుకుని మే 27న విడుదల చేసేందుకు సిద్ధం చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూ ‘ఎఫ్3’ సినిమా ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా వస్తుంది. ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఎఫ్3 ట్రైలర్ని విడుదల చేశారు మేకర్స.

ఎఫ్3 సమ్మర్ బిగ్గెస్ట్ ఎంటర్ టైనర్ కాబోతుందని థియేట్రికల్ ట్రైలర్‌ చూస్తే అర్ధమౌతుంది. 2 నిమిషాల 32 సెకన్లు నిడివిగల ఈ ట్రైలర్… ఆద్యంతం వినోదాన్ని పంచింది. ఎఫ్ 3 కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని మొదటే చెప్పిన చిత్ర యూనిట్…. ట్రైలర్ లో మిడిల్ క్లాస్ మనీ డ్రీమ్స్ ని హిలేరియస్ గా చూపించారు. ఈ సినిమాలో డైలాగులు కూడా నవ్వు కునే విధానం బాగా రాయటం ప్రత్యేకంగా చెప్పవచ్చు.

‘వాళ్ళది దగా ఫ్యామిలీ అయితే మనది మెగా ఫ్యామిలీ” అని వరుణ్ తేజ్ అనడం ట్రైలర్ లో ఒక హైలెట్ గా నిలిచింది. ఈ డైలాగ్ ఎఫ్ 3పై మరిన్ని అంచనాలు పెంచేసింది. వెంకటేష్, వరుణ్ తేజ్ పాత్రలని వినోదాత్మకంగా మలచిన దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్యాన్స్ కి ఒక సర్ ప్రైజ్ కూడా ఇచ్చారు. వెంకటేష్ రేచీకటి, వరుణ్ తేజ్ నత్తి వున్న పాత్రలలో కనిపించడం ప్రేక్షకులకు సర్ ప్రైజ్ వినోదాన్ని ఇచ్చింది.

F3 movie Trailer out now
F3 movie Trailer out now

హిలేరియస్ ఎంటర్‌టైనర్‌ లను రూపొందించడంలో అనిల్ రావిపూడి మరోసారి తన నైపుణ్యాన్ని చూపించాడు. ఎఫ్ 2కి మించిన వినోదం ఎఫ్3లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమౌతుంది. టెక్నికల్ టీమ్ వర్క్ విషయానికి వస్తే, సాయి శ్రీరామ్ కెమెరా పనితనం అద్భుతంగా వుంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ తో అదరగొట్టారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.

 

Related Articles

Telugu Articles

Movie Articles