అభిమానులకు క్షమాపణ చెప్పిన హీరో వెంకటేశ్‌..!

0
83
Venkatesh apologizes to fans for Narappa's OTT release

Venkatesh Narappa: అందరి ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్, స్టార్స్‌కు అభిమానులే కొండంత అండ. ఇక అగ్ర కథానాయకులకు ఉండే అభిమాన గణం, వారు చూపించే ప్రేమాభిమానాలు గురించి మనం ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమను అభిమానించే వారిని ఇబ్బంది పెట్టకుండా హీరోలు ప్రవర్తిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అభిమానులు హర్ట్ అయితే.. వారికి హీరోలు క్షమాపణ చెప్పడానికి ఏమాత్రం ఆలోచించరు.

విక్టరీ వెంకటేష్ హీరోగా ప్రియమణి హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “Narappa”. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం పలు కారణాల చేత ఈ నెల 20న డైరెక్ట్ గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా వెంకటేష్ ఇంటర్వ్యూ ఇచ్చారు.

మీకు ఇది మొదటి ఓటిటి రిలీజ్ సర్ దానిపై మీ స్పందన ఏంటి. అనే క్యూస్షన్ కి సమాధానం ఇస్తూ. అవును ఎవరికైనా కొన్ని ఫస్ట్ థింగ్స్ ఉంటాయి కదమ్మా, అలాగే ఇది కూడా నా లైఫ్ లో ఇది కూడా మొదటి సారే అనుకుంటాను. ఓటిటి లో విడుదల చేయడంపై ఫాన్స్ కొచం కోపంగా ఉన్నారు అని తెలిసింది.. కానీ కొన్ని విషయంలో ప్రొడ్యూసర్స్ కి అనుకూలంగా ఉండాలి అందుకే ఫాన్స్ కి సారీ చెపుతున్న..

Narappa actor Venkatesh says sorry to fans

కానీ కొవిడ్ కారణంగా దేశంలో, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల వల్ల తమ నారప్ప సినిమాను ఓటీటీలో విడుదల చేయాల్సి వచ్చిందని అందుకు అభిమానులు ఏమీ అనుకోకండంటూ వివరణ ఇచ్చుకున్నారు.