అదిరిపోయే ఫస్ట్ లుక్ తో రానా నాయుడు.. నెట్‌ఫ్లిక్స్‌ వెబ్‌సిరీస్‌.!!

వెంకటేష్ (Venkatesh) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు. అది కామెడీ అయినా యాక్షన్ సిరీస్ అయినా ఏదైనా సరే. ఈరోజు వెంకటేష్ బర్త్ డే సందర్భంగా తన మూవీస్ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రిలీజ్ చేశారు.

వెంకటేష్ రాబోయే సినిమా F3 నుంచి ప్రోమోని రిలీజ్ చేయగా, తన ఫస్ట్ వెబ్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu) నుంచి ఫోటో ని రిలీజ్ చేశారు. నెట్‌ఫ్లిక్స్‌ (NetFlix) విడుదల చేసే ఈ వెబ్ సిరీస్ కి రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. ‘రానా నాయుడు'(Rana Naidu) కరణ్ అన్షుమాన్ మరియు సుపర్ణ్ వర్మ దర్శకత్వం వహించారు.

ఈ రానా నాయుడు వెబ్ సిరీస్, ప్రముఖ అమెరికన్ టీవీ సిరీస్ అయినా ‘రే డోనోవన్’ (Ray Donovan) నీ రీమేక్ చేస్తున్నారు. ఇక పోస్టర్ని గమనిస్తే నెరిసిన జుట్టు, గడ్డం, చెవికి పోగుతో కనిపించిన ఆయన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇందులో వెంకటేశ్‌ రానానాయుడు(Rana naidu) అనే పాత్ర పోషిస్తున్నట్లు అర్థమవుతోంది.

Venkatesh First Look Poster From Rana Naidu netflix web series
Venkatesh First Look Poster From Rana Naidu netflix web series

ఎవరిదో పాస్‌పోర్ట్‌ ఫొటో పట్టుకుని ఆచూకీ కోసం వెతుతున్న వ్యక్తిలా ఇందులో కనిపించారు? మరి దీనికి సంబంధించిన కథ ఏమిటో తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి ఉండాల్సిందే. ప్రస్తుతం వెంకటేష్ F3 Movie షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

F2 movie కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాని అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్‌తేజ్‌, తమన్నా, మెహరీన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ఫిబ్రవరి 25న రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు ప్రొడ్యూసర్.

Follow @chitrambhalareI twitter account for daily updates  

Related Articles

Telugu Articles

Movie Articles