Venkatesh Naga Chaitanya Venky Mama First week Box office collections Details
Venkatesh Naga Chaitanya Venky Mama First week Box office collections Details

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని.. రికార్డు కలెక్షన్స్ ను రాబడుతుంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ వెంకి మామ 21.56 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపగా సినిమా ఇప్పుడు వర్కింగ్ డేస్ టెస్ట్ లో ఎంటర్ అయ్యింది, 4 వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు సినిమా 50% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. వెంకటేష్, నాగ చైతన్య కెరీర్లో ఇవే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 11 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం 63 శాతం రికవరీ సాధించినట్టు తెలుస్తుంది.

నైజాం 6.71 cr
సీడెడ్ 3.07 cr
ఉత్తరాంధ్ర 2.25 cr
ఈస్ట్ 1.40 cr
వెస్ట్ 0.87 cr
కృష్ణా 1.04 cr
గుంటూరు 1.48 cr
నెల్లూరు 0.64 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.86 cr
ఓవర్సీస్ 2.24 cr
వరల్డ్ వైడ్ టోటల్ 21.56 cr (share)

 

కొన్ని సెంటర్స్ లో బెటర్ గా పెర్ఫార్మ్ చేసినా ఓవరాల్ రెస్పాన్స్ మాత్రం ఇదే. ఇక సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చే సరికి రెండు తెలుగు రాష్ట్రాలలో తిరిగి 5% టు 8% వరకు గ్రోత్ ని కనబరించింది. దాంతో ఓవరాల్ గా 4 వ రోజును ఘనంగా ముగించబోతుంది ఈ సినిమా.అయితే ఈ రోజు నుండీ ఈ చిత్రానికి అసలు పరీక్ష మొదలుకానుంది. వీక్ డేస్ లో కూడా డీసెంట్ కలెక్షన్లను రాబడితే మొదటి వారం పూర్తయ్యే లోపు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంటుంది.