venkatesh naga chaitanya Venky Mama Release date and live updates
venkatesh naga chaitanya Venky Mama Release date and live updates

అక్కినేని నాగచైతన్య, విక్టరీ వెంకటేష్ కలిసి నటిస్తున్న చిత్రం వెంకీ మామ..! నాగచైతన్య సరసన రాశి ఖన్నా, వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ ఆడిపాడనున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలని మొదట భావించారు. ఇప్పటికే భారీ సినిమాలు రేసులో ఉన్న కారణంగా పోటీ నుండి తప్పుకున్నారు. డిసెంబర్ ఆఖరి వారంలో విడుదల చేయాలని భావించారు.. కానీ అంతకంటే ముందుగానే సందడి చేయడానికి వెంకీ మామ వచ్చేస్తున్నారు. డిసెంబర్ 13న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

వెంకటేశ్, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌ లైఫ్‌లో మామా అల్లుళ్లు అని తెలిసిందే..! ఒక్కసారి వీరిద్దరూ కలిసి ‘ప్రేమమ్’ సినిమాలో కనిపించారు. ఆ సినిమాలో వచ్చే చిన్న సన్నివేశానికే.. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చింది. అలాంటిది తెరపైన రెండున్నర గంటలు మామా అల్లుళ్లుగా ‘వెంకీమామ’ లో కనిపిస్తూ ఉండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ చిత్రాల దర్శకుడు కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్నో రిలీజ్ డేట్ లను పరిశీలించిన చిత్ర బృందం అనుకున్నదానికంటే ముందుగానే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. వెంక‌టేశ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా డిసెంబ‌ర్ 13న‌ సినిమాను విడుద‌ల చేయనున్నారు. ఇప్పటికే చిత్ర టీజర్లకు, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మల్టీ స్టారర్ సినిమా కావడంతో భారీ ఓపెనింగ్స్ కన్ఫర్మ్.. టాక్ మంచిగా వస్తే ఆ తర్వాత క్రిస్మస్ సెలవులు కూడా ఉండడంతో మంచి కలెక్షన్లు రాబట్టవచ్చనే ఆలోచనలో ఉన్నారు.