venkatesh naga chaitanya Venky Mama Release date confirmed
venkatesh naga chaitanya Venky Mama Release date confirmed

టాలీవుడ్ లో మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ వచ్చి చాలా రోజులే అయింది. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమా కోసం టాలీవుడ్ జనాలు ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక విక్టరీ వెంకటేష్-నాగ చైతన్య కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే అంచనాలు కూడా ఆకాశాన్ని అందుకున్నాయి. బాబీ దర్శకత్వంలో వీరిద్దరూ నటిస్తున్న పూర్తీ మాస్ సినిమా ‘వెంకీమామ’..! ఈ సినిమాలో వెంకటేశ్ సరసన పాయల్ .. చైతూ జోడీగా రాశి ఖన్నా కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా ప్రోమోలకు, సాంగ్స్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ మిలియన్ మార్కును ఈజీగా అందుకుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. ఇప్పటికే మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’.. అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన సినిమా ‘అల.. వైకుంఠపురం’ లో సినిమాలు సంక్రాంతికి రానున్నాయి. కళ్యాణ్ రామ్ హీరోగా ‘ఎంత మంచి వాడవురా’ కూడా సంక్రాంతికే విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంది. దీంతో సినిమాను వీలైనంత త్వరగా.. సంక్రాంతి కంటే ముందే విడుదల చేయాలని ఈ చిత్ర బృందం భావించింది. దీంతో రిలీజ్ డేట్ కోసం బాగానే హోమ్ వర్క్ చేశారు. డిసెంబర్ 13, 20వ తేదీన విడుదల చేయాలని భావించారు. డిసెంబర్ 25వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ సెలవులు బాగా కలిసొచ్చే అవకాశం ఉంది.. సంక్రాంతి సినిమాలు విడుదలవ్వడానికి చాలా టైమ్ ఉండడం ‘వెంకీమామ’ కు కలిసొచ్చే అవకాశముంది.