వెంకటేష్ రెండు సినిమాలు 75 కోట్లు.. OTT రిలీజ్..!

0
277
Venkatesh Narappa and drishyam 2 releasing Amazon prime OTT

Venkatesh Narappa: Drushyam2: విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సినిమాలు దృశ్యం 2, నారప్ప (Narappa) రెండు సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాలు అమేజాన్ ప్రైం (Amazon Prime OTT) కు 75 కోట్లకు అమ్మేసినట్టు టాక్. ‘నారప్ప’ చిత్రాన్ని జూలై 20న అమెజాన్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

దృశ్యం 2 ఆల్రెడీ మళయాళ వర్షన్ కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజై సక్సెస్ అయ్యింది అదే ఫార్మెట్ లో ఇప్పుడు వెంకటేష్ నటించిన తెలుగు దృశ్యం 2 కూడా ఓటీటీలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దృశ్యం 2, నారప్ప రెండు సినిమాలకు గాను సురేష్ బాబు అమేజాన్ ప్రైం కు 75 కోట్లు కోట్ చేసినట్టు తెలుస్తుంది. రెండు హిట్ సినిమాలు కాబట్టి తెలుగు ఆడియెన్స్ రిపీట్ గా చూస్తారన్న ఆలోచనతో సురేష్ బాబు అడిగినంత ఇచ్చేశారట ప్రైం నివాహకులు.

వీటితో పాటుగా రానా నటించిన విరాటపర్వం సినిమా కూడా ఓటీటీ రిలీజ్ చేస్తారని అంటున్నారు. విక్టరీ వెంకటేష్ మార్కెట్ పెద్దదే కాబట్టి దృశ్యం 2, నారప్ప సినిమాలకు మంచి రేటు పలికింది. అంతేకాదు ఆ రెండు సినిమాల శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటుకే అమ్మేశారని టాక్.

Venkatesh Daggubati wraps shoot for Telugu version of Drishyam 2

ఇక ‘నారప్ప’ చిత్రంలో నారప్ప భార్య సుందరమ్మ పాత్రలో ప్రియమణి నటించింది. మలయాళంలో దృశ్యం 2ను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో కూడా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే వెంకటేష్ ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసారు. మిగిలిన పార్ట్ వారం పది రోజుల్లో పూర్తి చేసి ఈ సినిమాకు గుమ్మడికాయ కొట్టేయనున్నారు. మీనా, వెంటకేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా.. నదియా మరో కీలకపాత్రలో కనిపించనుంది.

Previous article‘సర్కారు వారి పాట’ లేటెస్ట్ పోస్టర్..షూటింగ్ షురూ..!
Next article‘అఖండ’ ఫైనల్ షెడ్యూల్.. రిలీజ్ డేట్ పై క్లారిటీ..!