స‌మ్మ‌ర్ స్పెష‌ల్‌గా విడుద‌ల‌కానున్న‌విక్ట‌రి వెంక‌టేష్ `నార‌ప్ప`

247
Venkatesh Narappa movie release date locked

సురేష్ ప్రొడక్షన్స్ ప్రై.లి, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా విక్టరీ ఇంటిపేరుగా చేసుకున్న వెంకటేష్ హీరోగా, మనసుకు హత్తుకునే ఆహ్లాదకరమైన చిత్రాలు చేసే శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు, కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్న భారీ చిత్రం `నారప్ప`. విభిన్న తరహా పాత్రలు చేయడంలో మొదటినుండీ ముందుండే జాతీయ ఉత్తమ నటి ప్రియమణి ఈ మూవీలో సుందరమ్మగా తెలుగు వారికి చాలా రోజులు గుర్తుండిపోయే పాత్ర చేస్తున్నారు.

ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే విడుద‌లైన గ్లిమ్స్‌, పోస్ట‌ర్లకు మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా సంక్రాంతి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ మేక‌ర్స్ స‌రికొత్త పోస్ట‌ర్‌ విడుద‌ల చేశారు. వెంకటేష్ , ప్రియ‌మ‌ణి ఫ్యామిలీ అంతా ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. వెంకీ గ‌తంలో ఎన్న‌డూ క‌నిపించ‌ని విధంగా ఇలా ఫ్యామిలీతో క‌లిసి కొత్త‌గా కనిపిస్తున్నా‌రు. పోస్ట‌ర్ లో కేరాఫ్‌ కంచరపాలెం ఫేం కార్తీక్ ర‌త్నం స‌హా వెంకీ ఫ్యామిలీ అంతా హాయిగా న‌వ్వుడం చూడొచ్చు.. ఇప్ప‌టివ‌ర‌కు విడుద‌లైన లుక్స్ సినిమాపై అంచ‌నాల‌ను రోజురోజుకీ పెంచేస్తున్నాయి. ఈ మూవీని వేసవిలో రిలీజ్ చేయనున్నట్లు పోస్ట‌ర్ ద్వారా తెలిపారు మేక‌ర్స్‌.