మే14న థియేటర్ల లో సందడి చేయనున్న ‘నారప్ప’

0
302
venkatesh-narappa-releasing-on-may-14th
venkatesh-narappa-releasing-on-may-14th

విక్టరీ వెంకటేష్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా నారప్ప. ఈ సినిమా తమిళ సినిమా అసురన్‌కు రీమేక్‌గా రూపొందుతుంది. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్‌లో తమిళ స్టార్ హీరో ధనుష్ చేశారు. అక్కడ అసురన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో వెంకటేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని విడుదల చేశారు. ఈ సినిమా మే14న ప్రేక్షకులు ముందుకు వస్తుందని ప్రకటించారు.

 

 

ఈ సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న నారప్ప సినిమాను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో నారప్ప భార్య పాత్రలో ప్రియమణి నటిస్తున్నారు. అద్భుత తారాగణంతో నారప్ప సినిమాను కలైపులి యస్ ధను, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పోస్టర్లు మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమాపై అభిమానులు తారాస్థాయి అంచనాలు పెట్టుకున్నారు. మరి నారప్ప ప్రేక్షకులను ఎంత వరకు అలరిస్తారనేది చూడాలి.