వెనక్కి తగ్గిన Venkatesh..రెమ్యున‌రేష‌న్ వాపస్..?

Venkatesh Narappa: విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. అయితే.. థియేటర్లు ఓపెన్ చేసుకోవడానికి ప్రభుత్వాల పర్మిషన్ ఇచ్చినా ఇంకా థియేటర్లు ఓపెన్ చేయలేదు. అయితే తొలుత ఈ సినిమాను థియేట్రికల్‌గా కాకుండా నేరుగా ఓటీటీలో (OTT) విడుద‌ల చేయాల‌ని మేకర్స్ ఫిక్స‌యిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఎప్పుడైతే నారప్ప (Narappa) ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయో అప్పటి నుంచి సురేష్‌ బాబు పై విమర్శలు మొదలయ్యాయి. వెంకీ అభిమానులు అయితే.. నారప్ప (Narappa) సినిమాను ఎట్టి పరిస్థితుల్లోను థియేటర్లోనే రిలీజ్ చేయాలి ఓటీటీలో రిలీజ్ చేయద్దు అన్నారు. ఓ అభిమాని అయితే.. ఏకంగా ఒక రోజు నిరాహార దీక్ష చేశానని మిగిలిన వెంకీ అభిమానులు కూడా నిరాహార దీక్ష చేయాలి అంటూ సోషల్ మీడియాలో పిలుపు నిచ్చారు.

ఈ నేపధ్యంలో నిర్మాత సురేశ్ బాబు నార‌ప్పను ఓటీటీలో విడుద‌ల చేయాల‌న్న నిర్ణ‌యాన్ని మార్చుకున్నారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు స‌ద‌రు ఓటీటీ ప్లాట్‌ఫాం కూడా సురేశ్ బాబు నిర్ణ‌యం ప‌ట్ల సానుకూలంగానే ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో థియేట‌ర్ విడుద‌ల వ‌ల్ల సినిమాకు న‌ష్టాలు కనుక వ‌స్తే త‌న రెమ్యున‌రేష‌న్ తిరిగి ఇచ్చేస్తాన‌ని చెప్పి ఎస్ థానును ఒప్పించే ప్ర‌య‌త్నాల్లో విక్టరీ వెంక‌టేశ్ ఉన్న‌ట్టు టాక్ వినిపిస్తుంది.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles