Venkatesh new movie Saindhav Story: శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ కొత్త సినిమా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈరోజు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ని అలాగే గ్లింప్స్ నీ విడుదల చేయటం జరిగింది. సైంధవ్ టైటిల్ తో వస్తున్న సినిమాలో వెంకటేష్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. విడుదల చేసిన సైంధవ్ గ్లింప్స్ సినిమాపై భారి అంచనాలను ఏర్పడేట్టు చేశాయి.
Venkatesh new movie Saindhav Story: వెంకటేష్ చాలా సంవత్సరాల నుంచి ఫ్యామిలీ అలాగే కామెడీ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అలాగే సరైన మాస్ బొమ్మ పడి చాలాకాలమైంది. అప్పట్లో ‘శత్రువు’, ‘గణేష్’, ‘ధర్మచక్రం’లో వెంకీమామ ఫుల్ మాస్ రోల్స్ లో కనిపించారు. ఇప్పుడు అదే విధంగా సైంధవ్ సినిమాలో కనిపించనున్నారు.
ఈ సినిమా స్టోరీ సంబంధించి విడుదల చేసిన సైంధవ్ గ్లింప్స్ ప్రకారం, డ్రగ్స్ అలాగే మాఫియా ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నట్టు అర్థం అవుతుంది. ఇకపోతే సైంధవ్ గ్లింప్స్ లో ‘Onasemnogene abeparvovec’ డ్రగ్స్ చూపించడం జరిగింది. అయితే దీనిపై వికీపీడియాలో పొందుపరిచిన సమాచారం ప్రకారం జన్యుపరమైన సమస్యలు ఎదుర్కొనే 2 ఏళ్ల లోపు పిల్లల కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది.
అలాగే దీని ట్రీట్మెంట్ కోసం సుమారు 14 కోట్లు ఖర్చవుతుందని తెలియజేశారు. ఇక దీనిని ఆధారంగా చూసుకుంటే సినిమా మంచి కంటెంట్ తో వస్తుందని అర్థం అవుతుంది. సైంధవ్ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే మొదలు పెట్టనున్నట్టు మేకర్స్ తెలియజేశారు.
మొట్ట మొదటిసారిగా వెంకటేష్సి నిమాని పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన హీరోయిన్ మిగతా వివరాలు త్వరలోనే ప్రకటిస్తా ఉన్నట్టు తెలియజేశారు.