Venkatesh, Next Film Details, Telugu Movie News,

వెంకటేష్ కి ఎక్కువ విజయాలు అందించి స్టార్ డమ్ ని అందించింది రీమేక్ సినిమాలే.తెలుగులో చాలామంది హీరోలు రీమేక్ సినిమాలు చేసినా వాటిలో ఎక్కువ శాతం ఫెయిల్యూర్ అయినవే.ఒక్క వెంకటేష్ మాత్రమే రీమేక్ సినిమాలతో మెజారిటీ విజయాలు అందుకున్నాడు.

కెరీర్ మొదటి నుండి కూడా రీమేక్ సినిమాలు చేస్తూ వచ్చిన వెంకటేష్ ఈ మధ్య కూడా బాడీగార్డ్,మసాలా,గోపాల గోపాల,దృశ్యం,గురు…ఇలా చాలా రీమేక్ సినిమాల్లో నటించాడు.అయితే వాటిలో ఎక్కువ శాతం హిందీ సినిమాలే ఉన్నాయి.F2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ సినిమాలో నటిస్తున్న వెంకటేష్ అది పూర్తయిన తరువాత ఒక రీమేక్ సినిమా చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నట్టు టాక్.

అజయ్ దేవగన్,రకుల్ ప్రీత్,టబు ముఖ్య పాత్రల్లో తెరకెక్కి 100 కోట్లు కొల్లగొట్టిన రొమాంటిక్ కామెడీ ఎంటెర్టైనెర్ అయిన దే దే ప్యార్ దే ని రీమేక్ చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నారట వెంకటేష్ అండ్ సురేష్ బాబు.ఇలాంటి సినిమాలు తెలుగులో చాలా వచ్చినప్పటికీ కామెడీ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయితే మళ్ళీ హిట్ గ్యారంటీ.పైగా అజయ్ దేవగన్ తో పోల్చుకుంటే వెంకటేష్ కామెడి టైమింగ్ చాలా బెటర్ గా ఉంటుంది.అందుకే ఆ పాత్ర వెంకీ కి ట్రైలర్ మేడ్ లా సరిపోతుంది.

అలానే ఆ సినిమాలో ఫిమేల్ లీడ్స్ గా నటించిన టబు,రకుల్ ఇద్దరు తెలుగువాళ్ళకు బాగా పరిచయమే.టబు ఆల్రెడీ వెంకటేష్ తో జతకట్టింది.ఇక రకుల్ కూడా నాగార్జున తో మన్మధుడు-2 లో నటిస్తుంది కాబట్టి ఈ రీమేక్ కి ఓకే అనే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.రీమేక్ రైట్స్ డీల్ ఓకే అయితే మాత్రం పెద్దగా లేట్ లేకుండానే ఈ కామెడీ సినిమా తెలుగులో రీమేక్ అయిపోతుంది.అయితే వెంకీ టైమింగ్ ని,సినిమా సోల్ ని పట్టుకునే డైరెక్టర్ ఐ వెదికిపట్టుకోవడమే తరువాయి