నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో “సైంధవ్” అనే సినిమా చిత్రీకరణ నాన్‌స్టాప్‌గా జరుగుతోంది. కథానాయకుడు వెంకటేష్ మునుపెన్నడూ చేయని అద్భుతమైన యాక్షన్ రోల్ చేయబోతున్నాడు. వరుస హిట్టు సినిమాలను రూపొందించిన దర్శకుడు శైలేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు జనాన్ని ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాలో చాలా మంది ప్రముఖ నటీనటులు ఉండటంతో ఈ సినిమాపై వెంకటేష్ ఫాన్స్ అలాగే మూవీ లవర్స్ భారీగానే అంటున్నాడు. లేటెస్ట్ గా మూవీ టీం భారీ క్లైమాక్స్ యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసినట్టు సోషల్ మీడియాలో వీడియోని విడుదల చేయడం జరిగింది.
చాలా రోజులుగా సినిమా నటీనటులు అలాగే దర్శకుడు ఈ సినిమాకు సంబంధించిన హై వోల్టేజ్ ఎమోషనల్ క్లైమాక్స్ సన్నీవేషాలను పూర్తి చేయడానికి చాలా రకాలుగా కష్టపడినట్టు తెలుస్తుంది. అయితే మధ్యలో వానలు పడటంతో షూటింగ్ కూడా కొంత గ్యాప్ అయితే వచ్చింది. అయినప్పటికీ దర్శకుడు శైలేష్ పక్కా ప్లాన్ తో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ షెడ్యూల్ ని పూర్తి చేసినట్టు వివరించారు. ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ యాక్షన్ షూట్ ని చేయటం జరిగిందంట.
మూవీ టీం అందరూ దాదాపు 16 రోజులపాటు కష్టపడి ఈ సన్నివేశాలని చిత్రీకరణ చేయడం జరిగింది.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన టీమ్ అందరికీ దర్శకుడు అలాగే నిర్మాత అభినందనలు తెలపటంతో పాటు షూటింగ్ వీడియోను కూడా సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది.

“శ్యామ్ సింగ్ రాయ్” భారీ విజయం సాధించిన చిత్ర నిర్మాత సైంధవ్ సినిమా కూడా కచ్చితంగా వెంకటేష్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. శైలేష్ కొలను ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్‌కి ఇది 75వ సినిమా.
ఇక ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిక్, శ్రద్ధా శ్రీనాథ్, రౌహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా మరియు సారా సైన్ హేవ్‌లో కీలకమైన పాత్రలో నటించనున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చగా, ఎస్.మణికందన్ కెమెరామెన్. మరియు “సైంధవ్” డిసెంబర్ 22న, క్రిస్మస్ సందర్భంగా భారతదేశం అంతటా విడుదల కానుంది.