క్రేజీ కాంబినేషన్ ‘జాతి రత్నాలు’ డైరెక్టర్‌తో స్టార్ హీరో మూవీ..!

0
6411
Venkatesh to star in 'Jathi Ratnalu' director Anudeep next movie

Venkatesh: ‘జాతి రత్నాలు’ తో టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు అనుదీప్. అనుదీప్ దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే కామెడీ కంటెంట్ ను ఎంచుకోవడం సాహసమేనని చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాను

అయితే తన తదుపరి సినిమాపై ఇప్పటి వరకూ క్లారిటీ ఇవ్వని అనుదీప్ ఇటీవల టాప్ హీరో వెంకటేశ్ కి కథ వినిపించాడట. కథ లో మార్పులు .. చేర్పుల పరంగా చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. మన స్టార్ హీరోలలో కామెడీ పండించటంలో ముందుంటాడు వెంకీ.

అనుదీప్ కి తన బలం .. బలగం కామెడీనే అనే విషయం అర్థమైపోయింది. ఈ కథకి వెంకటేశ్ అయితే కరెక్టుగా సెట్ అవుతాడని భావించిన అనుదీప్ ఆయనను సంప్రదించడం జరిగిందట. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే ఇక ప్రేక్షకులకు కడుపుబ్బ నవ్వే.

Also Read: సురేందర్ రెడ్డి, పవన్ మూవీ అప్డేట్..!

Venkatesh to star in 'Jathi Ratnalu' director Anudeep next movie

పూర్తి స్క్రిప్ట్ రెడీ అయితే వెంకీ నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకుని వెంటనే అధికారికంగా ప్రకటిస్తారట. వెంకటేశ్ ను కనుక అనుదీప్ ఒప్పించగలిగితే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఎక్కువ సమయం పట్టదు.

Also Read: అఖిల్ స్టన్నింగ్ పోస్టర్ తో ‘ఏజెంట్’ షూటింగ్ అప్డేట్

 

Previous articleఅనారోగ్యంతో ఆసుపత్రిలో అడవి శేష్..!
Next articleDhanush #D43 film is a thriller: Director Sekhar Kammula