‘ఎఫ్‌3’ షూట్‌ మళ్లీ మొదలైంది..!

0
152
Venkatesh Varun Tej Resume F3 Movie shooting

F3 Movie Shooting: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో వచ్చిన `ఎఫ్ 2` చిత్రం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్లు ఎక్కువ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో `ఎఫ్ 3` సినిమా రాబోతోంది. ఇప్పటికే శర వేగంగా సినిమాను పూర్తి చేసేందుకు చిత్రయూనిట్ ప్రణాళిక వేసింది.

ఎఫ్ 2 సినిమాతో నవ్వుల వర్షం కురిపించిన అనిల్ రావిపూడి..ఎఫ్ 3తో మరోసారి నవ్వించేందుకు రాబోతోన్నారు. టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైద్రాబాద్‌లో నేడు (శుక్రవారం) ప్రారంభమైంది.

ఈ షెడ్యూల్‌లో చిత్ర తారాగణం అంతా పాల్గొననున్నారు. మేకింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. ఇందులో నటీనటులు, టెక్నీషియన్స్ అందరి మొహాలపై చిరునవ్వుతో సెట్ అంతా కూడా సందడి వాతావరణం కనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి మ‌రియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వ‌రస విజ‌యాల‌తో మంచి ఫామ్‌లో ఉన్నారు.

Venkatesh Varun Tej Resume F3 Movie shooting

వరుణ్ తేజ్‌లకు ప్రత్యేకమైన మ్యానరిజంలు, బాడీ లాంగ్వేజ్‌లను క్రియేట్ చేశారు. తమన్నా, మెహ్రీన్‌లు వెంకటేష్, వరుణ్ తేజ్ స‌ర‌స‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోన్నారు.

 

 

Previous articleNeha Shetty Latest Photo Shoot
Next articleVarun Tej and Venkatesh Resume F3 Movie shoot