venkatesh varun tej starrer f2 movie received central award

f2 movie central award: కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబందించిన గెజిట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ”ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫస్ట్రేషన్” చిత్రానికి కేంద్ర అవార్డు లభించింది.

వెంకటేష్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ‘ఎఫ్‌2’ సినిమా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. అన్ని కేటగిరీల్లో కలిపి అవార్డు దక్కించుకున్న ఏకైక తెలుగు సినిమాగా ‘ఎఫ్2’ నిలిచింది. 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా హిట్‌గా నిలిచింది. హీరోలు వెంకటేష్, వరుణ్‌తేజ్, హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ కౌర్‌తో పాటు ఇతర తారాగణం చేసిన కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందించే పనిలో పడ్డారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో హాస్యనటుడు సునీల్ కూడా నటించనున్నట్లు ఇటీవల వార్తలొచ్చాయి.