Venkatesh Venky Mama 5 days box office collections details
Venkatesh Venky Mama 5 days box office collections details

విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య హీరోలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) డైరెక్షన్లో తెరకెక్కిన క్రేజీ మల్టీ స్టారర్ చిత్రం ‘వెంకీమామ’. ‘సురేష్ ప్రొడక్షన్స్’ ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించాయి. డిసెంబర్ 13న వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని.. రికార్డు కలెక్షన్స్ ను రాబడుతుంది.

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 26.03 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, నాగ చైతన్య కెరీర్లో ఇవే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 7 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. మంగళవారం రోజున.. కూడా ఈ చిత్రం 1.45 కోట్ల షేర్ ని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.78 కోట్ల షేర్ వరకు మాత్రమె వసూల్ చేసింది, ఇవి డీసెంట్ కలెక్షన్స్ అయినా రెండో వీక్ లో పోటి దృశ్యా ఇవి సరిపోవు అనే చెప్పాలి.

నైజాం 8.24 cr
సీడెడ్ 3.56 cr
ఉత్తరాంధ్ర 2.88 cr
ఈస్ట్ 1.72 cr
వెస్ట్ 1.07 cr
కృష్ణా 1.28 cr
గుంటూరు 1.75 cr
నెల్లూరు 0.77 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.18 cr
ఓవర్సీస్ 2.58 cr
వరల్డ్ వైడ్ టోటల్ 26.03 cr (share)