Venkatesh Venky Mama First Day Box office collections Report
Venkatesh Venky Mama First Day Box office collections Report

వెంకటేష్, నాగచైతన్య హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ సినిమా ‘వెంకీమామ’. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చిత్రంలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్‌పుత్ నటించగా, నాగచైతన్య సరసన రాశీ ఖన్నా నటించింది. దేవి శ్రీ ప్రసాద్, థమన్ సంయుక్తంగా బాణీలు కట్టారు. డిసెంబర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటిరోజే మిశ్రమ స్పందన తెచ్చుకొని చెప్పుకోదగ్గ కలెక్షన్స్ రాబట్టింది.

వీరిద్దరు కలిసి నటించిన ‘వెంకీ మామ’ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా విశేషమైన వసూళ్లు రాబట్టింది. చిత్రం ఒక్కరోజులో రూ.16.5 కోట్లు రాబట్టినట్లు నిర్మాణ సంస్థ సురేష్‌ ప్రొడక్షన్స్‌ వెల్లడించింది. అద్భుతమైన కలెక్షన్స్‌తో చిత్రం ప్రారంభమైందని ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పోస్టర్‌ను కూడా షేర్‌ చేసింది. అంతేకాదు ఇది వెంకీ, చైతన్య కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్‌ సాధించిన చిత్రంగా నిలిచినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.

నైజాం 2.29 cr
సీడెడ్ 1.60 cr
ఉత్తరాంధ్ర 0.87 cr
ఈస్ట్ 0.60 cr
వెస్ట్ 0.34 cr
కృష్ణా 0.36 cr
గుంటూరు 0.72 cr
నెల్లూరు 0.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.85 cr
ఓవర్సీస్ 0.95 cr
వరల్డ్ వైడ్ టోటల్ 8.85 cr (share)

 

‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక మొదటి రోజు ఈ చిత్రానికి 8.85 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, నాగ చైతన్య కెరీర్లో ఇవే బెస్ట్ కలెక్షన్స్ అని చెప్పాలి. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావలి అంటే మరో 25 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఇదే జోరును కొనసాగిస్తే వీకెండ్ కే 80 శాతం రికవరీ సాధించే ఛాన్స్ ఉందని.. ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరి వారి అంచనా ఎంత వరకూ కరెక్ట్ అనేది చూడాల్సి ఉంది.

Click Here For VenkyMama Movie Review