నారప్ప సెన్సార్ అప్డేట్.. ఓటీటీలోనా? థియేటర్లోనా?

0
60
Venkatesh's 'Narappa' is done with Censor formalities Completed

Venkatesh Narappa: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ”నారప్ప”. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా సినిమా విడుదల వాయిదా వేసుకున్నారు.  శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రియమణి, కార్తీక్ రత్నం వంటి వారు ప్రధాన పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

అయితే నారప్ప, దృశ్యంను సురేష్ బాబు 70 కోట్లకు ఓటీటీ సంస్థకు అమ్మేశారంటూ వార్తలు వస్తున్నాయి. వాటిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఈ నేపథ్యంలో ‘నారప్ప’ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. సమాజంలోని కుల వ్యవస్థ వంటి సామాజిక అంశాలతో రూపొందించబడిన ఈ చిత్రానికి ‘U/A’ సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేశారు.

త్వరలోనే మిమ్మల్ని కలుస్తాం అని చెప్పారు. కానీ అది ఓటీటీలోనా? థియేటర్లోనా? అనేది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వెంకీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇది తమిళ బ్లాక్ బస్టర్ హిట్ ‘అసురన్’ చిత్రానికి అఫిసియల్ తెలుగు రీమేక్. వెంకటేశ్ ఇందులో యువకుడిగా మధ్య వయస్కుడిగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నాడు.

Venkatesh's 'Narappa' is done with Censor formalities