(Venky Mama Movie Second week Box office Collections) విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య ల కాంబో లో తెరకెక్కిన మల్టీ స్టారర్ వెంకి మామ, డిసెంబర్ 13న.. వెంకటేష్ పుట్టినరోజున విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుని.. మంచి కలెక్షన్స్ ను రాబడుతుంది. వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్… నాగ చైతన్య సరసన రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఘనంగా ముగించగా సినిమా రెండో వారాన్ని 250 థియేటర్స్ లో కొనసాగించగా రెండో వారం పోటి లో 4 కొత్త సినిమాలు వచ్చినా వెంకిమామ సినిమా గట్టిగానే నిలిచింది.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 30 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయడం విశేషం. నిన్న 4 సినిమాలు విడుదైనప్పటికీ కూడా 0.49 కోట్ల షేర్ ను రాబట్టింది అంటే.. ఈ చిత్రం ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. ‘వెంకీమామ’ చిత్రానికి 32.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇక 8 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 28.88 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 4.2 కోట్ల వరకూ షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో వారంలోకి ఎంటరయినప్పటికీ అదే జోరు చూపిస్తుంది ‘వెంకీమామ’ చిత్రం. ఇక ఈ చిత్రం 8 డేస్ ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి..
నైజాం | 9.11 cr |
సీడెడ్ | 3.86 cr |
ఉత్తరాంధ్ర | 3.38 cr |
ఈస్ట్ | 1.88 cr |
వెస్ట్ | 1.17 cr |
కృష్ణా | 1.40 cr |
గుంటూరు | 1.88 cr |
నెల్లూరు | 0.83 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.41 cr |
ఓవర్సీస్ | 2.88 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 28.80 cr (share) |