విజయ్ దేవరకొండ, సమంతా జంటగా నటించిన “కుషి” సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలైంది. నిన్ను కోరి, మజిలీ వంటి చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు, ఇప్పటికే విడుదలైన కృషి టీజర్ అలాగే సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఖుషి ట్రైలర్ ఆకట్టుకునేలా ఉందని చెప్పవచ్చు.
ఖుషి ట్రైలర్ ని గమనిస్తే.. విజయ్ దేవరకొండ చెప్పే దీనమ్మ కాశ్మీర్. సేమ్ రోజా సినిమాలానే ఉంది’ డైలాగ్ తో మొదలవుతుంది. అలాగే విజయ్ సమంతా ప్రేమ కూడా కాశ్మీర్లోనే మొదలవుతుంది ఆ తర్వాత కుటంబంలోని వారు పెళ్లికి ఒప్పుకోకపోవడం.. దీంతో తల్లిదండ్రులని కాదని బయటికి వచ్చి ఇద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని జీవినం సాగించడం,ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల గొడవలు రావడం.. ఇద్దరి మధ్య ప్రేమని.. వంటివి బాగా చూపించారు ఖుషి ట్రైలర్లో.

వాస్తవానికి, వర్గ విభేదాలు లేదా సమాజ భేదాలతో కూడిన జంట కథ కొత్త విషయం కాదు, కానీ స్క్రీన్ ప్లే అలాగే స్టోరీని తీయటంలో దర్శకుడు బాగానే చేశారని చెప్పాలి. అబ్దుల్ హేషామ్ వహాబ్ అందించిన సంగీతం ఆకట్టుకుంది, మురళి జి రూపొందించిన విజువల్స్ కూడా అద్భుతమైనవి.
గీతాగోవిందం తర్వాత విజయ్ దేవరకొండ పక్కింటి అబ్బాయిగా కనిపించడం ఖుషీ ట్రైలర్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. VD మరియు సమంతా రుత్‌ప్రభు మధ్య కెమిస్ట్రీ పైసా-వసూల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి హామీ ఇస్తుంది. ఖుషి సెప్టెంబర్ 1, 2023న సినిమాల్లోకి రాబోతోంది.