Mahesh Babu – Vijay Antony – Bichhagadu 2 విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా కొన్నేళ్ల క్రితం విడుదలయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. దీంతో బిచ్చగాడు 2 సినిమాని మన ముందుకు తీసుకు వస్తున్నారు మళ్ళీ విజయ్ ఆంటోని. ఈ సినిమా కొన్ని నెలలుగా ప్రమోషన్ లో భాగంగా కొన్ని వీడియోస్ ని విడుదల చేయటంతో సినిమా పై అంచనాలు తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వచ్చాయి. కావ్య దప్పర్ హీరోయిన్గా చేస్తున్న బిచ్చగాడు 2 ఈనెల 19న విడుదల చేస్తున్నారు.
బిచ్చగాడు సినిమా మొదటి పార్ట్ దాదాపు 12 కోట్ల వరకు కలెక్షన్స్ ని వసూలు చేసింది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు బిచ్చగాడు 2 సినిమా బిజినెస్ వచ్చేటప్పటికి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల పైనే అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నారు. . ఒకవేళ మొదటి షో పాజిటివ్ టాక్ వస్తే 6 కోట్లు వసూలు చేయటం పెద్ద సమస్య కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ.. బిచ్చగాడు 2 సినిమా మొదటి భాగానికి ఎటువంటి సంబంధం ఉండదని అలాగే బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్తో బిచ్చగాడు 2 సినిమా వస్తున్నది చెప్పడం జరిగింది. అలాగే తను చేసిన ఐదు సినిమాలు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తామని దీనితోపాటు స్ట్రైట్ తెలుగు మూవీ ఒకటి చేస్తున్నట్టు.. దానికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలుపుతాం అన్నట్టు చెప్పడం జరిగింది..

ప్రమోషన్ లో భాగంగా విజయ్ ఆంటోని తెలుగు రాష్ట్రాల్లో మీడియా వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. ఈ ఇంటర్వ్యూలో బిచ్చగాడు 2 సినిమాని మీరు కాకపోతే ఏ హీరో చేస్తే బాగుంటుంది అనే క్వశ్చన్ ఎదురయింది. దీనికి విజయ్ ఆంటోని సమాధానమిస్తూ.. మహేష్ బాబు అయితే ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతారని..హావభావాలను మహేష్ బాబు (Mahesh Babu) అద్భుతంగా చూపించగలరని తెలిపారు. తమిళంలో విజయ్ (Vijay) కానీ అజిత్ (Ajith) కానీ చేస్తే కరెక్టుగా ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
విజయ్ ఆంటోని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిచ్చగాడు 2 సినిమాకి విజయ్ ఆంటోనీ ప్రొడ్యూసర్ గా అలాగే దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా ఎవల్లో ఈ సినిమాని విడుదల చేయటం వల్ల విజయ్ ఆంటోని అన్ని ప్రాంతాల్లోనూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ ఆంటోనీకి తెలుగు రాష్ట్రాల్లో బిచ్చగాడు సినిమా తర్వాత అనుకున్నంత స్థాయిలో హిట్ దక్కలేదు.. ఈ సినిమాతో అయినా మళ్లీ బ్లాక్ బస్టర్ పడుతుందేమో చూడాలి.